వాలంటీర్లు అనే వారు లేరు.. ఇప్పుడు వారంతా పార్టీ కార్యకర్తలే అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వాలంటీర్లు అంతా రిజైన్ చేసారు.. గతంలో కూడా పార్టీ ఆశయాలు నమ్మే కుటుంబం నుంచి వచ్చినవారే .. టీడీపీ ఎన్ని అవమానాలు చేసిన ఐదేళ్లు నిలబడి పని చేశారు.. అప్పుడు ఓ మాట.. ఇప్పుడో మాట చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటర్ల వ్యవస్థపై గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏడ్చారు అని పోసాని కృష్ణ మురళి అన్నారు. మగ వాలంటర్లు నారా లోకేష్ లా తాగుబోతులు.. తిరుగు బోతులు కాదు అని మండిపడ్డారు. చంద్రబాబుకు సిగ్గు ఉండాలి.. వాలంటర్ల వ్యవస్థపై చంద్రబాబుకు కన్ను కుట్టింది అని పేర్కొన్నారు.
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ.. ఇటీవలే రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్.. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇక్బాల్‌కు పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు..
నేడు, రేపు గోదావరి జిల్లాల్లో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ఈ రోజు తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో.. రేపు పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచారం సాగనుంది..
వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేద్దామనుకున్నా.. చంద్రబాబు నేడు వారిపై కల్లబొల్లి ప్రేమ వలకపోస్తున్నాడు అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు కుటీల వాగ్దానాలను ఎవరు నమ్మరు.. ప్రజల్లో తిరుగుబాటు రావడంతోనే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నాడు అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రౌడీ రాజ్యం పాలిస్తుందని రాజారెడ్డి రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యాంగం రావాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఉదయగిరి తెలుగుదేశం- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు.
సిద్ధరామయ్యకు ఊహించని పరిమాణం.. తుపాకీతో వ్యక్తి హల్చల్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎన్నికల ప్రచారంలో ఊహించని పరిణామం ఎదురైంది. వాహనం పైనుంచి కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ వెళ్తున్న సిద్ధరామయ్య దగ్గరకు ఓ వ్యక్తి నడుముకు తుపాకీ పెట్టుకుని వెళ్లి పూల దండ వేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన కార్యకర్తలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాహనంపై ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, పార్టీ అభ్యర్థులకు పూలదండలు వేసి హల్చల్ చేశాడు. అనంతరం ఆ వ్యక్తి వాహనం దిగి కిందికి వెళ్తుండగా…
విరాళాల కోసం ప్రత్యేక వెబ్ సైట్ టీడీపీ రూపొందించింది. tdpforandhra.com పేరుతో విరాళాలు సేకరించనున్నారు. ఇక, విరాళాల వెబ్ సైటును చంద్రబాబు లాంచ్ చేశారు. ఈ మేరకు పార్టీకి వెబ్ సైట్ ద్వారా రూ. 99,999 మేర తొలి విరాళాన్ని చంద్రబాబు అందించారు.