ఏపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, వైసీపీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తుకుంటూ పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసుకుంటున్నాయి.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలు లేరు గళం మాత్రం ఉందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. నేను పెద్ద ముదురు అని చంద్రబాబు అంటున్నారు.. చంద్రబాబు కంటే ప్రజలకు మేలు చేయడంలో.. రైతులకు మేలు చేయడంలో నేను ముదురన్నారు.
వారాహి యాత్రకు వచ్చినపుడు ఇక్కడ మంత్రి రోజు అన్నం పెట్టే రైతుని ఏడిపించిన విధానం నన్ను బాధించింది.. రైతు కంట కన్నీరు పెట్టించిన మంత్రి ఆయన కొడుకు తుడిచిపెట్టుకుపోవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. నాకు అనుభవం ఉంది.. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉందన్నారు. రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడు అయ్యింది.. ప్రజాగళంకు వారాహి తోడు అయ్యింది.. సైకిల్ స్పీడుకు తిరుగు లేదు.. గ్లాసు జోరుకు అడ్డు లేదు అని పేర్కొన్నారు.
వాలంటీర్లు అనే వారు లేరు.. ఇప్పుడు వారంతా పార్టీ కార్యకర్తలే అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వాలంటీర్లు అంతా రిజైన్ చేసారు.. గతంలో కూడా పార్టీ ఆశయాలు నమ్మే కుటుంబం నుంచి వచ్చినవారే .. టీడీపీ ఎన్ని అవమానాలు చేసిన ఐదేళ్లు నిలబడి పని చేశారు.. అప్పుడు ఓ మాట.. ఇప్పుడో మాట చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటర్ల వ్యవస్థపై గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏడ్చారు అని పోసాని కృష్ణ మురళి అన్నారు. మగ వాలంటర్లు నారా లోకేష్ లా తాగుబోతులు.. తిరుగు బోతులు కాదు అని మండిపడ్డారు. చంద్రబాబుకు సిగ్గు ఉండాలి.. వాలంటర్ల వ్యవస్థపై చంద్రబాబుకు కన్ను కుట్టింది అని పేర్కొన్నారు.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ.. ఇటీవలే రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్.. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇక్బాల్కు పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు..
నేడు, రేపు గోదావరి జిల్లాల్లో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ఈ రోజు తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో.. రేపు పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచారం సాగనుంది..