Duvvada Srikanth: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. రాజీనామాలు, మరో పార్టీలో చేరికకు అధికార, ప్రతిపక్షాలు అనే తేడా లేకుండా పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పలాసలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీకాంత్ వైసీపీకి గుడ్‌బై చెప్పారు.. ఇక, ఆయన బాటలో ఆయన భార్య రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ దువ్వాడ జయశ్రీ కూడా అడుగులు వేశారు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. 11 ఏళ్లుగా పార్టీకి సేవలందించానని అయినా తనకు తగిన గుర్తింపు లేదంటున్న దువ్వాడ శ్రీకాంత్.. దానికి తోడు గడిచిన కొన్నేళ్లుగా పార్టీలో తనకు అవమానాలు జరిగాయని.. వాటిని తట్టుకోలేక వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.. మరోవైపు.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్ననట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు దువ్వాడ శ్రీకాంత్.
Read Also: Harish Rao: పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలందించింది.. మరి బీజేపీ చేసిందేమిటి?