Chelluboina Venu: ఏపీలో ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై పెద్ద రచ్చే జరుగుతోంది.. అధికార, విపక్షాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తు్న్నాయి.. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం పార్టీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.. ఇంకా 13 వేల గ్రామాలలో సర్వే చేయాల్సి ఉంది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చంద్రబాబు చూస్తున్నాడు. నిజాలు మాట్లాడుతున్న వ్యక్తికి.. నిజాలు మాట్లాడని వ్యక్తికి.. మధ్య జరుగుతున్న పోరాటం ఇది. కల్పిత పాత్రలతో ప్రజలను భయపెట్టాలని చూస్తున్నాడు. పేదల ఇళ్ల స్థలాల కోసం రైతులకు డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి భూములు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు బినామీలు చట్టం ద్వారా బయటపడతారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అమరావతి పేరుతో అసైన్డ్ భూములను ఎస్సీల భూములను చంద్రబాబు గుంజుకున్నాడు అని ఆరోపించారు.
ఇంకా అమలులోకి రాని చట్టాన్ని చంద్రబాబు రద్దు చేస్తాడట అని ఎద్దేవా చేశారు వేణుగోపాలకృష్ణ… తన పరిధిలో లేని రిజర్వేషన్లను ముందు పెట్టి కాపులను మోసం చేశాడన్న ఆయన.. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీతో చెప్పించగలరా ..? అని సవాల్ విసిరారు. చంద్రబాబు మాటల్లో స్పష్టత లేదు. వాలంటీర్ల విషయంలో వారికి వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేసింది ఎవరు….? మీరు కాదా …? అని నిలదీశారు. టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని భారతీయ జనతా పార్టీ నేతలు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఇలాంటి టైటిలింగ్ యాక్ట్‌పై జరుగుతున్న దుష్ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ..