Botsa Satyanarayana: నువ్వు కాదు.. మీ జేజమ్మలు వచ్చిన చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు అంటూ వ్యాఖ్యానించారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలు ఇంత నీచానికి దిగితాయని అనుకో లేదు.. డీపీటీ పద్దతిలో పథకాలకు డబ్బుల వేస్తే టీడీపీ అడ్డం పెట్టి లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.. ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ లకు డబ్బులు వేస్తుంటే అడ్డు తగలడం అన్యాయమన్న ఆయన.. టీడీపీ ఎన్నికలను అడ్డుపెట్టికొని లబ్ధిదారుల ఉసురు తీసుకుంటున్నారు.. చేయూత మూడో నెలలో సమకూర్చాం.. నాలుగో నెలలో వెయ్యాలని అనుకున్నాం.. ఎన్నికల కోడ్ అని అడ్డం పెట్టారని విమర్శించారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, చేయూత ఇవ్వనియ్య కుండా టీడీపీ అడ్డు తగులుతోందని మండిపడ్డారు.
ఏమీ లేకుండానే ఇప్పుడే ఇలా టీడీపీ అరాచకాలు చేస్తుంటే.. ఇలాంటి వాళ్లకి ఓటేస్తే తర్వాత మరే విధంగా ఉంటుందో ఊహించలేమన్నారు మంత్రి బొత్స.. గతంలో ఎన్నికలు అవుతుండగానే పసుపు కుంకుమ పథకం ద్వారా మీరే ఇచ్చారు.. మరి ఇప్పుడెందుకు అడ్డంపడుతున్నారో అర్ధం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈసీపై మా నిరసనను తెలియజేస్తున్నాం.. ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించాలి.. ఫిర్యాదులు వస్తే మీరు తలొగ్గుతారా..? అని నిలదీశారు.. ఎన్నికల అయినాకైనా మేమే అధికారంలోకి వస్తాం.. కోర్టుకి వెళ్లైనా తెస్తాం అన్నారు. విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. అన్నం తిన్న మనిషి అయితే ఇంతగా దిగజారుతారా..? ఈ భూమి మీది కాకుండా పోతుందనే ప్రకటనలేంటి..? అని మండిపడ్డారు. నువ్వు కాదు కదా జేజమ్మలు వచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడంటూ పవన్ పై మండిపడ్డారు. లబ్ధిదారులకు డీపీటీ ద్వారా ఇవ్వమని రాత్రి కోర్టు ఆర్డర్ ఇస్తే.. ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోదే.. కోర్టు అర్డర్ ను దిక్కరించి ఈసీ అడ్డం పడటం మేం నిరసిస్తున్నాం అన్నారు. వచ్చే పదిహేను రోజులలో నైనా లబ్ధిదారులకు డబ్బులు వేస్తామని చెబుతున్నాం.. తమని కాదని ఏమైనా లబ్ధిదారులకు డబ్బుకు వేస్తే సీఎస్ పై చర్యలు ఉంటాయని బెదురిస్తారా అంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.