రాజ్ భవన్ లో ఎన్డీయే కూటమి నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్డీయే శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నట్టు గవర్నుకు లేఖ అందించారు.
Chiranjeevi : ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డియే కూటమి అద్భుత విజయం సాధించింది.రాష్ట్రంలో మొత్తం 175 సీట్లకు గాను కూటమి ఏకంగా 164 సీట్లు సాధించి తిరుగు లేని విజయం సాధించింది.కూటమిలో భాగమైన జనసేన 21 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసింది అలాగే 2 పార్లమెంట్ నియోజకవర్గాలలో పోటీ చేసింది.అయితే పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలలో కూడా జనసేన తిరుగులేని విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ సంపాదించింది.అలాగే కూటమిలో భాగం…
ఎన్డీయే కూటమికి శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. కూటమి అద్భుత విజయం సాధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన విజయం అని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం, తగ్గాము, నిలబడ్డామన్నారు.
విజయవాడలో ఎన్డీయే శాసనసభాపక్ష సైతం జరిగింది. ఇందులో శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గన్నవరంలోని కేసరపల్లి ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. బుధవారం జరగబోయే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని హాజరు కాబోతున్నారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు షెడ్యూల్ రిలీజ్ చేసింది.
నేడు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 10.30 గంటలకు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యేల శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతుంది.. ఇక, ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఆయన ప్రమాణస్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. గన్నవరం ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నారు.. వీఐపీలు పెద్ద సంఖ్యలు తరలిరానున్న నేపథ్యంలో.. ప్రముఖుల కోసం ఐదు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు..