ఆంధ్రుల జీవనాడి పోలవరంను జగన్ అదోగతి పాలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ అన్నారు. 20 ఏళ్ల క్రితం వైయస్ శంకుస్థాపన చేసినా ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. మంగళవారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడారు.
చిన్నారిపై అత్యాచార ఘటన.. మంత్రులు సీరియస్ చిన్నారిని చిదిమేసిన నిందితున్నీ వదిలేది లేదని మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష విధిస్తామన్నారు. రైస్ మిల్లులో పని చేస్తున్న వారి పై వివరాలు తెలుసుకునేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం చాలా సిరీయస్ గా ఉందన్నారు. ఇలాంటి సంఘటనల…
నామినేటెడ్ పదవుల భర్తీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్ పదవులిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా జాప్యం చేయకుండా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ఆయన భావిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక, ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చింది.
Janasena Chief: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాడిన ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైంది అని ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. 16, 347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని పేర్కొన్నారు.
AP CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. తన హయాంలో వీలైనన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తొలుత విద్యా శాఖలో మరిన్ని పోస్టులను భర్తీ చేసే దిశగా ఎన్డీయే సర్కార్ కసరత్తు చేస్తుంది.
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరు తొలగించి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్దరణ చేస్తున్నట్లు సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, పెన్షన్ల పెంపుపై జీవో జారీ చేశారు. ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరుతో ఏపీలో పెన్షన్ల స్కీం చంద్రబాబు సర్కార్ అమలు చేయనుంది.