ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 24 మందికి శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మంత్రుల అభీష్టం, వారి సామర్థ్యాన్ని బట్టి శాఖలను కేటాయిస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు.
ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారని.. తనపై నమ్మకంతో ప్రధాని మోడీ పౌర విమానయాన శాఖ అప్పగించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనపై పెట్టిన బాధ్యతకు సంపూర్ణ న్యాయం చేస్తానని రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా అన్నారు.
గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చెప్పారు.కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అలిపిరి వద్ద క్లైమోర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని.. మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి..
గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. కానీ ఈ సారి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని.. ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 93 శాతంపైగా విజయం దేశ చరిత్రలో ఎవరికి రాలేదన్నారు. వెంకటేశ్వర స్వామి ముందు సంకల్పం చేసుకొని ముందుకు వెళ్తానని ఆయన చెప్పారు. కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.
Ghattamaneni Adiseshagiri Rao got emotional while Chandrababu taking oath: విభజిత ఆంధ్ర ప్రదేశ్ కి మూడవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వగా రెండో విడత వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇక మూడవసారి చంద్రబాబు నాయుడుకి అవకాశం రావడంతో ఈరోజు ఉదయం ఆయన ప్రధాని మోదీ సహా అనేక మంది హేమాహేమీల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక…
ఆంధ్రప్రదేశ్‌లో నూతన సర్కారు కొలువుదీరింది. మంత్రివర్గం ప్రమాణస్వీకారం ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయిస్తారనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Pawan Kalyan Takes Blessings of Chiranjeevi: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో యువరాజ్యం బాధ్యతలు తీసుకుని మొట్టమొదటిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం మూతపడడంతో ఇక రాజకీయాల వైపు చూడరేమో అనుకున్నారు. అయితే 2014వ సంవత్సరంలో జనసేన అనే పార్టీని స్థాపించి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా బిజెపి తెలుగుదేశం కూటమికి బయట నుంచి…
Chiranjeevi Went in Special Flight for Chandrababu Swearing in Ceremony: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో కేసరపల్లి ఐటి పార్క్ లో ఏర్పాటు చేసిన భారీ వేదిక వద్ద ఈ ప్రమాణస్వీకారం ఘట్టం జరగనుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నారు. ఈ రోజు రాత్రి కల్లా ఆయన విజయవాడ చేరుకోనున్నారు. ఆయన మాత్రమే కాకుండా కేంద్ర…