Pawan Kalyan Takes Blessings of Chiranjeevi: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో యువరాజ్యం బాధ్యతలు తీసుకుని మొట్టమొదటిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం మూతపడడంతో ఇక రాజకీయాల వైపు చూడరేమో అనుకున్నారు. అయితే 2014వ సంవత్సరంలో జనసేన అనే పార్టీని స్థాపించి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా బిజెపి తెలుగుదేశం కూటమికి బయట నుంచి మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల్లో స్వయంగా పోటీ చేసి ఒక సీటుకే పరిమితమైన ఏపీ రాజకీయాల్లో మాత్రం ఆయన ఎప్పటికప్పుడు యాక్టివ్గానే ఉంటూ హాట్ టాపిక్ అవుతూ వచ్చారు.
Pawan Kalyan Ane Nenu: ట్రెండింగ్ లో పవన్ కళ్యాణ్ అనే నేను!
2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్టుతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చ నివ్వను అంటూ బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఏర్పాటు ఎందుకు పవన్ ముఖ్య కారణమయ్యారు. ఎట్టకేలకు పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్ ఈరోజు చంద్రబాబు ప్రమాణస్వీకారం అనంతరం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ప్రమాణస్వీకారం అనంతరం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరించిన పవన్ తన అన్న చిరంజీవి కాళ్ళ మీద పడి మరోసారి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాదు దగ్గరలోనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అనే నేను, గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అనే హ్యాష్ టాగ్స్ కూడా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ట్రెండ్ అవుతున్నాయి.