Jr NTR invited to Chandrababu Swearing in Cermony: విభజిత ఆంధ్ర ప్రదేశ్ కి మూడవ ముఖ్యమంత్రిగా మరోసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నూట అరవై నాలుగు అసెంబ్లీ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉండగా రేపే కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జనసేనకు ఎలాంటి పదవులు ఇస్తారు? బిజెపికి ఎలాంటి పదవులు ఇస్తారు? అనే విషయం మీద చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే రాజకీయ సినీ రంగాలకు చెందిన పలువురికి ఆహ్వానాలు అందాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి ఇప్పటికే బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లారు. రేపు ఉదయం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రామ్ చరణ్ తేజ్, చిరంజీవి పాల్గొనబోతున్నారు.
Noor Malabika: నూర్ మరణంపై మౌనం వీడిన కుటుంబ సభ్యులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి
అలాగే టాలీవుడ్ కి చెందిన చాలామందికి కూడా ఆహ్వానాలు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. వీరిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. నిజానికి 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కు తెలుగుదేశానికి కాస్త గ్యాప్ వచ్చింది. అయితే అదేమీ లేదని అవసరం అనుకున్నప్పుడు తాను వస్తానని పలు సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. టిడిపి కూడా ఎన్టీఆర్ తమ వాడేనని చెబుతూ ఉంటుంది. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ గెలిచిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు అవుతారా? లేదా? అనే విషయం మీద చర్చ జరుగుతోంది. అయితే ఎన్టీఆర్ గోవా పరిసర ప్రాంతాల్లో దేవర షూట్ లో బిజీగా ఉన్న క్రమంలో ఆయన హాజరు కావడం కష్టమే అంటున్నారు.