Chiranjeevi Went in Special Flight for Chandrababu Swearing in Ceremony: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో కేసరపల్లి ఐటి పార్క్ లో ఏర్పాటు చేసిన భారీ వేదిక వద్ద ఈ ప్రమాణస్వీకారం ఘట్టం జరగనుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నారు. ఈ రోజు రాత్రి కల్లా ఆయన విజయవాడ చేరుకోనున్నారు. ఆయన మాత్రమే కాకుండా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు కూటమి నేతలు గవర్నర్ కు తమ బలాబలాలకు సంబంధించిన వివరాలు అందించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ చంద్రబాబుని ఆహ్వానించారు. ఈ మేరకు రాజ్ భవన్ కి చంద్రబాబు చేరుకోగా ప్రభుత్వ ఏర్పాటు, మంత్రుల కూర్పు విషయాన్ని సైతం గవర్నర్కు వివరించినట్లుగా తెలుస్తోంది. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.
Jr NTR- Chandrababu: చంద్రబాబు ప్రమాణస్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం.. హాజరవుతారా? లేదా?
ముఖ్యంగా సినీ రంగానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ, సూపర్ స్టార్ రజినీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వాళ్లకు ఆహ్వానాలు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి స్పెషల్ ఫ్లైట్ లో భార్య సురేఖ , కుమార్తె శ్రీజ, ఇద్దరు మనవరాళ్లతో బేగంపేట్ నుంచి గన్నవరం వెళ్లారు. రేపు ఉదయం జరగబోతున్న ప్రమాణస్వీకారంలో ఆయన పాల్గొనబోతున్నారు. రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ షూటింగ్లో ఉన్న నేపథ్యంలో రాజమండ్రి నుంచి గన్నవరం వెళుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యే విషయం మీద సందిగ్ధత కొనసాగుతోంది. కానీ రజనీకాంత్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.