నీట్ ఫలితాలపై దుమారం..విచారణ కోరుతున్న ప్రియాంక గాంధీ నీట్ ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. దీనిపై వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ని డిమాండ్ చేస్తున్నారు. జూన్ 4న వెలువడిన నీట్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం మే 5న సాయంత్రం…
రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివదేహానికి చంద్రబాబు దంపతులు నివాళులర్పించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను వారు ఓదార్చారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
ఈ రోజు సచివాలయంలో ఆర్థిక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి హాజరైన ఆర్థిక శాఖ ఉన్నతాధికారి సత్యనారాయణ సహా ఇతర అధికారులు హాజరయ్యారు.. ఏపీ ఆర్థిక స్థితి గతులపై కీలకంగా చర్చ సాగింది.. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే నివేదిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎస్ నీరభ్ కుమార్..
Ramoji Rao: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత సుపరిచితుడు, మీడియా దిగ్గజం రామోజీరావు ఇక లేరు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఈరోజు (శనివారం) తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు సంస్థ ప్రకటించింది.
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, మీడియా మొఘల్, పద్మవిభూషణ్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. రామోజీరావు తెలుగు వెలుగు. రామోజీ మృతి తీరని లోటు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన రామోజీ అసామాన్య విజయాలు సాధించారు. రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలందించారు అని గుర్తుచేశారు
Ys Jagan Tweets about Situation in Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది, టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది అని ఆరోపించిన ఆయన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని అన్నారు. పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు…
Chandrababu Swearing in Event to be Managed By Boyapati Srinu: అమరావతిలో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక, ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 12న ఉదయం 11:27కు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడ శివారు గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీపార్క్ దగ్గర ప్రమాణస్వీకారం జరగనుంది.. ప్రమాణస్వీకారానికి అధికార వర్గాలు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ సహా ఎన్డీఏ వర్గానికి చెందిన పలువురు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీ ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు ప్రభుత్వ అధికారులు. ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. రాజధాని గ్రామాలు, ఎయిమ్స్ సమీపంలోని ప్రాంతాలతో పాటు గన్నవరం పరిసర ప్రాంతాలను కూడా చూస్తున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడక్కడా జరుగుతున్న కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల విషయంపై ఆయన పార్టీ నేతల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు.