Film Chamber Seeks Chandrababu Lokesh Pawan Kalyan Appointment: తెలుగు సినీ పరిశ్రమకి గత 50 సంవత్సరాల నుండి ఎనలేని సేవ చేస్తూ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి అధ్యక్షుడుగా సేవలందిస్తూ, హిందూపురం మూడోసారి ఎం. ఎల్. ఏ గా విజయం సాధించిన నందమూరి బాలకృష్ణను తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ-జనసేన కూటమి సంచలనం సృష్టించింది. ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించడం విశేషం. టీడీపీ 144కు గానూ 135, జనసేన 21కి 21, బీజేపీ 10 చోట్ల పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలిచింది.
రుషికొండ విషయంలో కోర్టులకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తనన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి బాధ్యులపై చర్యలు ఖచ్చితంగా ఉంటాయని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బయట నుంచి వచ్చిన రెడ్లు ఉత్తరాంధ్రలో దందాలు చేశారని భారీగా భూ దోపిడీ జరిగిందన్నారు. దోపిడీకి గురైన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో జరిగిన భూ దోపిడీకి…
ఆంధ్రుల జీవనాడి పోలవరంను జగన్ అదోగతి పాలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ అన్నారు. 20 ఏళ్ల క్రితం వైయస్ శంకుస్థాపన చేసినా ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. మంగళవారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడారు.
చిన్నారిపై అత్యాచార ఘటన.. మంత్రులు సీరియస్ చిన్నారిని చిదిమేసిన నిందితున్నీ వదిలేది లేదని మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష విధిస్తామన్నారు. రైస్ మిల్లులో పని చేస్తున్న వారి పై వివరాలు తెలుసుకునేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం చాలా సిరీయస్ గా ఉందన్నారు. ఇలాంటి సంఘటనల…
నామినేటెడ్ పదవుల భర్తీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్ పదవులిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా జాప్యం చేయకుండా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ఆయన భావిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక, ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చింది.