Auto Driver Seva: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది. ఈ సందర్భంగా మరో కొత్త పథకాన్ని తీసుకొస్తుంది. రాష్ట్రంలోని డ్రైవర్ల సంక్షేమం కోసం ‘ఆటో డ్రైవర్ సేవలో...’ పథకానికి శ్రీకారం చుట్టింది.
Piyush Goyal: ఢిల్లీలో జరుగుతున్న సీఐఐ సమ్మిట్ లో పాల్గొన్న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. చంద్రబాబు నా పెద్దన్న.. సంస్కరణల ఆర్కిటెక్ట్ అని పేర్కొన్నారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో అవినీతి రాజ్యమేలుతోందని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అవినీతి చక్రవర్తి చంద్రబాబు అన్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి అభ్యర్థికి, ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లు పడతాయి... కానీ, ఒక్క ఏపీలోనే ఎన్డీఏ అభ్యర్థికి వన్ సైడ్ ఓట్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రామకృష్ణ.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ కొత్త నిర్వచనం చెప్పి ఆయన.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని కించపరిచే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నారు..