CM Chandrababu: సత్యసాయి జయంతి ఉత్సవాలకు ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులం మతం ప్రాంతాలకు అతీతంగా నిస్వార్ధ సేవకు నిలువెత్తు రూపం అయ్యారు. రూ. 550 కోట్లు ఖర్చు పెట్టి ఏపీ- తెలంగాణ- తమిళనాడులో 1600 గ్రామాలకు 30 లక్షల మందికి పైగా నీరు అందించారు.. ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని సాయి సేవలో ముందుకు తీసుకెళ్తుంది.. ఇంత పెద్ద ఎత్తున సేవలు చేసే ఆర్గనైజేషన్ ఎక్కడ లేదు.. కేంద్ర మంత్రులు, అనేక హైకోర్టులకు సంబంధించిన చీఫ్ జస్టిస్ లు కూడా ఈ వేడుకలకు వచ్చారు.. సాయిబాబా సిద్ధాంతాన్ని, జ్ఞానాన్ని ముందుకు తీసుకు వెళ్లేలా వారందరినీ ఇక్కడికి రప్పించారని నా ప్రగాఢమైన నమ్మకం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: CM Revanth Reddy: బాబా మనుషుల్లో దేవుడిని చూశారు.. ప్రేమతో మనుషులను గెలిచారు..
ఇక, తెలుగు రాష్ట్రాలకు దేశంలో ప్రపంచంలో ఉండే ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమంలో నేను భాగస్వామ్యం కావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ అదృష్టంగా భావిస్తున్నాను.. సాయి బాబా వదిలి పెట్టి పోయినటువంటి ఈ పవిత్రమైన పుణ్యభూమిని ప్రపంచానికి ఒక శక్తివంతమైనటువంటి ప్రాంతంగా తయారు చేయాలంటే స్థానికంగా ఉండే అందరి సహకారం అవసరం అని చంద్రబాబు అన్నారు.