CM Chandrababu: మంగళగిరి APSP బెటాలియన్‍లో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజా రక్షణ కోసం ప్రాణాలు. పణంగా పెడుతున్న వారు పోలీసులు.. శాంతి భద్రతలు, అభివృద్ధి, సంక్షేమం ముడి పడి ఉంటాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావు.. అందుకే క్రైమ్ రేట్ అణిచి వేయటంలో నేను కాంప్రమైజ్ కాను అని చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: RAPO : రామ్ – భాగ్యశ్రీ.. లవ్ కన్ఫమ్ చేసిన ‘చౌ మామ’..
ఇక, ఏపీ పోలీసులు అంటే ఒక బ్రాండ్ అని సీఎం చంద్రబాబు తెలిపారు. రౌడీయిజం, నక్సలిజం, ఫ్యాక్షనిజం లాంటి వాటిపై ఉక్కుపాదం మోపి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు గుర్తింపు ఉందన్నారు. పోలీసులు కఠినంగా ఉంటారు కానీ వారికి మానవత్వం ఎక్కువ అని పొగడ్తలతో ముంచెత్తారు. నేరాల తీరు మారుతోంది.. క్రిమినల్స్ బాగా అప్డేట్ అవుతున్నారు.. సైబర్, వైట్ కాలర్ నేరాలు పెరిగాయి.. రాష్ట్రంలో ప్రతి 55 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాం.. డ్రగ్స్, గంజాయిని గుర్తించి ధ్వంసం చేస్తున్నాం.. ఎర్ర చందనం అడవుల్లో గుర్తించి పట్టుకుంటున్నారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Tension in Tenali: చంద్రబాబు కాలనీలో ఉద్రిక్తత- చిన్నపిల్లల గొడవతో కుటుంబంపై దాడి
అలాగే, విజిబుల్, ఇన్విజిబుల్ పోలీసింగ్ ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. పోలీసులు కూడా కొత్త వెర్షన్ గా మారి ముందుకు వెళ్ళాలి.. నేరస్తులు ఇంటెలిజెంట్ క్రైమ్స్ చేస్తున్నారు.. వారి కంటే ముందుంటే తప్ప వారిని కట్టడి చేయలేం అన్నారు. గూగుల్ పెట్టుబడి వైజాగ్ రావటానికి కారణం లా అండ్ ఆర్డర్.. గతంలో ఐటీ, ఇప్పుడు ఏఐ టెక్నాలజీది భవిష్యత్.. రాజకీయ ముసుగులో కొత్త కొత్త నేరాలు జరుగుతున్నాయి.. ప్రాణం కంటే మనం చేసే పనులు ముఖ్యం.. కొన్ని రాజకీయ పార్టీలు ఫేక్ ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు.