కేంద్ర ప్రభుత్వం గెజిట్లు విడుదల చేసినా.. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి… జల జగడంపై స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి… చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నీటి కేటాయింపులు జరిగేవన్న ఆయన.. తెలుగు రాష్ట్రాల్లో సాగు నీటి ప్రాజక్టులపై మాట్లాడే నైతిక హక్కు ఏ పార్టీకి లేదన్నారు.. బ్రిజేష్ ట్రిబ్యునల్ అనేక సార్లు నీటిని కేటాయిస్తామన్నా ప్రాజక్టులను పూర్తి చేసిన పాపాన…
ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు పెంచాయి.. దీంతో.. అదే స్థాయిలో ఎదురుదాడికి దిగుతోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ… ఇవాళ మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి… విపక్షాల కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు హయాంలో కేవలం 8 వేల మందికే ఉద్యోగాలిచ్చారన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం 1.84 లక్షల ఉద్యోగాలిచ్చిందని.. గ్రామ సచివాలయాల్లోనే 1.30 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని.. ఇవి కాకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.. ప్రభుత్వ…
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది… పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన శోభాహైమావతి.. టీడీపీకి గుడ్‌బై చెప్పారు.. 1999-2004 మధ్య ఎస్.కోట ఎమ్మెల్యేగా పని చేసిన హైమావతి… గత ఎన్నికల కంటే ముందు వరకు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారు.. పార్టీల్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు. అయితే, ప్రస్తుతంలో ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోవడానికి తోడు… టీడీపీలో అంతర్గత రాజకీయాలు కూడా ఎక్కువైనట్టుగా…
టీడీపీ అధినేతకు మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ సెగ తగిలింది. జిల్లాల పర్యటనలో పార్టీ జెండాలతోపాటు జూనియర్ ఎన్టీఆర్ జెండాలు రెపరెపలాడాయి. గతంలో కుప్పం.. ఇప్పుడు మచిలీపట్నం. ఊరు మారినా కేడర్ రూపంలో చేస్తున్న హడావిడి సేమ్ టు సేమ్. పార్టీలో రచ్చ రచ్చ అవుతోంది. ఇంతకీ ఆ ప్రచారం వెనక ఎవరున్నారు? టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! చంద్రబాబు మచిలీపట్నం పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ జెండాలు 2019లో ఓటమి తర్వాత టీడీపీకి ఏపీలో కష్టకాలం…
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాలు, జిల్లాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడని… ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు రాసిన లేఖ దాన్ని స్పష్టం చేస్తోందని మండిపడ్డారు. తెలుగు దేశం కాస్త… తెలంగాణ దేశం పార్టీగా అవతరిస్తోందని నిప్పులు చెరిగారు. గుండ్లకమ్మ, రామతీర్థం వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్సార్ చేశారని… చంద్రబాబు తన ప్రాంతానికి ఏమి చేశాడో చెప్పాలని చురకలు అంటించారు. read also :…
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాయలసీమకే కాదు.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం చేశాడని ఫైర్ అయ్యారు. “సీమకే కాదు ఉమ్మడి ఏపీకి అన్యాయం చేసింది చంద్రబాబే. నీటి కేటాయింపులు లేకుండా కర్నాటక ఆల్మట్టి డ్యాం నిర్మిస్తుంటే అప్పటి ప్రధాని దేవెగౌడకు ఆగ్రహం కలుగుతుందని నోరు మూసుకున్నది ఎవరు? 14 ఏళ్లు…
చంద్రబాబు రెండు రాష్ట్రాలు, జిల్లాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటూ మండిపడ్డారు ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు రాసిన లేఖ దాన్ని స్పష్టం చేస్తోందని విమర్శించారు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గుండ్లకమ్మ, రామతీర్థం వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్సార్ చేశారని.. చంద్రబాబు తన ప్రాంతానికి ఏమి చేశాడో చెప్పాలి? అని డిమాండ్ చేశారు.. వైఎస్ జగన్ వచ్చాక వెలిగొండ మొదటి టన్నెల్ పూర్తి చేసి రెండో టన్నెల్…
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంపై సంచలన ఆరోపణలు చేశారు మంత్రి హరీష్‌రావు.. కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు వచ్చారని వ్యాఖ్యానించిన ఆయన.. బాబు తన మనుషులకు కాంగ్రెస్‌లో పదవులు ఇప్పిస్తున్నారన్న ఆయన.. చంద్రబాబు ఆనాడు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే ఆంధ్రబాబు అని ప్రజలు వెల్లగొట్టారని.. టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని, తన మనుషులను కాంగ్రెస్ లోకి పంపి తెలంగాణలో చంద్రబాబు అడుగు పెడుతున్నారని…
ఏపీలో రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో రోడ్డెక్కే ప్రయత్నం చేశారు టీడీపీ చీఫ్. రాజకీయంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో నేతలు.. కార్యకర్తల్లో చురుకు పుట్టించాలని అనుకున్నారు. కానీ.. అధినేత ఒకటి తలిస్తే.. జిల్లాల్లో తమ్ముళ్లు చేసింది మరొకటి. పవర్లో ఉన్నప్పుడు పూర్తిస్థాయిలో అధికారం అనుభవించిన వారు.. రోడ్డెక్కేవేళ పత్తా లేకుండా పోయారట. అదే టీడీపీ శిబిరంలో హాట్ టాపిక్‌గా మారింది. 175 నియోజకవర్గాల్లో దీక్షలకు టీడీపీ ప్లాన్ కోవిడ్ బాధితులను ఆదుకోవాలనే డిమాండ్‌తో టీడీపీ ఏపీవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.…
టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి ఆళ్లనాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు మూడు గంటల పాటు చేసిన దీక్ష చూసి ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారని.. చంద్రబాబు వ్యాఖ్యలు చూసి ఆయన అసలు స్వరూపం బయట పడిందని.. ఆయన పరిపాలన లో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాష్ట్రం అంతా కరోనాతో అల్లాడుతున్న సమయంలో తండ్రి, కొడుకులు హైదరాబాద్ లో జూమ్ మీటింగ్ పెట్టుకుంటూ కాలక్షేపం చేశారని…