చంద్రబాబు దీక్షపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. మోకాలికి బోడిగుండుకు లింకుపెట్టే తత్వం చంద్రబాబుది అన్నారు. చంద్రబాబు చరిత్ర అంత కుట్రల మయమేనని, పార్టీ ఆఫీసులో రెండు బల్లలు విరిగితే రాష్ట్రపతి పాలనా పెట్టాలా..? చంద్రబాబు జీవితమే నేరాల చిట్టాఅన్నారు. వంగవీటి రంగా, మల్లెల బాజ్జీ, ఎన్టీఆర్ మరణాలకు చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు. నీతికి నిలబడిన ముద్రగడ కటుంబంపై అమానుషంగా ప్రవర్తించిది మర్చిపోయారా అని ఘాటుగా వ్యాఖ్యనించారు. చంద్రబాబుకి మతిమరుపు ఎక్కువని, ఆయన…
టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా దీక్ష చేపట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అయితే, బాబు దీక్షపై సెటైర్లు వేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష అంటూ కామెంట్ చేశారు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. 36 గంటలు కాదు.. 12 గంటలు కూడా ఆయన దీక్ష చేయలేరన్నారు. కేవలం అధికారం రాలేదనే సీఎం వైఎస్ జగన్‌ను పట్టుకుని నానా మాటలు అంటున్నారని విమర్శించారు. చంద్రబాబు దీక్ష అంటేనే దొంగ దీక్ష అని…
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం సంచలన వీడియో విడుదల చేశారు. తనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందన్న పట్టాభి ..వీడియో తేదీ, సమయం కూడా చూపించారు. తన ఒంటిపై ప్రస్తుతం ఎలాంటి గాయాలు లేవని చూపించారు పట్టాభి. పోలీసు కస్టడీలో తనకు ప్రాణహాని ఉందని పట్టాభి ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉదంతం నేపథ్యంలో వీడియో విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు పట్టాభి. తాను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టుపై తనకు…
టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. ఏపీలో టీడీపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులపై కేంద్రం దృష్టి పెట్టాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు ఎలా ప్రవర్తించారో, అప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. అప్పట్లో ఏపీలోకి అడుగుపెట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి అర్హత లేదని చంద్రబాబు అన్నారని జీవీఎల్ ఆరోపించారు. ఇప్పుడు ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఏం ముఖం…
ఏపీలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం భౌతిక దాడుల వరకు వెళ్లింది. దీంతో అధికార పార్టీపై ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. ఈ అంశంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏపీకి కేంద్ర బలగాలు పంపాలని చంద్రబాబు హోంశాఖ అధికారులకు లేఖ రాశారు. మరోవైపు వైసీపీ దాడులకు నిరసనగా…
ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యల కారణంగా రాజకీయ వేడి పులుముకుంది. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టగా అది రణరంగంగా మారింది. పలువురు ఆందోళనకారులు టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులపై ప్రతిపక్ష టీడీపీ మండిపడుతోంది. అయితే ఈ అంశంపై మంత్రి కొడాలి నాని ఎన్టీవీతో మాట్లాడారు. ఇది కూడా చదవండి: పట్టాభిరామ్ మాట్లాడింది దారుణమైన భాష: డీజీపీ టీడీపీ కార్యాలయాలపై దాడులను తాను…
టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై దాడి తర్వాత రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ శ్రేణుల దాడులకు నిరసనగా రేపటి నుంచి చంద్రబాబు నిరవధిక నిరసన దీక్షకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు బాబు. రేపు ఉదయం 8 గంటల నుంచి 36 గంటల పాటు చంద్రబాబు దీక్ష కొనసాగనుంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు దీక్షకు దిగుతున్నారు చంద్రబాబు. పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు దీక్షకు అన్ని…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసన దీక్షకు సిద్ధమయ్యారు.. నిన్న టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. కొన్ని జిల్లా కార్యాలయాలపై కూడా దాడులు జరిగిన నేపథ్యంలో.. 36 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టనున్నారు టీడీపీ చీఫ్.. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడికి నిరసనగా రేపు ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష కొనసాగనుంది… టీడీపీ కార్యాలయంలో ధ్వంసమైన వాహనాలు, ఫర్నిచర్ మధ్యలోనే కూర్చొని దీక్ష చేయనున్నారు చంద్రబాబు.…
ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది.. టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. పట్టాభి ఇంట్లో విధ్వంసమే సృష్టించారు.. ఇక, టీడీపీ కేంద్ర కార్యాలయం, ఇతర జిల్లా కార్యాలయాలపై వైసీపీ శ్రేణులకు దాడులకు పాల్పడ్డాయి.. కొన్ని చోట్ల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ పరిణామాలపై సీరియస్‌గా రియాక్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చారు.. అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ సంస్థలు, ప్రజాస్వామ్య హితైభిలాషులు…
ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ జిల్లా పోలీసులు నోటీసులు పంపడంతో ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వైసీసీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాల ముందు నిరసన చేపట్టాయి. అయితే ఈ నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. కాగా టీడీపీ కార్యాలయాలపై దాడులకు వైసీపీతో సంబంధం లేదని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు.…