చంద్రబాబు దీక్షకు కౌంటర్‌గా ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేత జనాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు ప్రజాగ్రహ దీక్షలో పాల్గొన్న మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు. చంద్రబాబునాయుడుపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు అండతో పట్టాభి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే దాడి జరిగిందన్నారు. పట్టాభి కి మద్దతుగా చంద్రబాబు దీక్ష చేయడం సిగ్గుచేటు అన్నారు. మా సంక్షేమ పథకాలకు ప్రజలలో వస్తున్న ఆదరణకు అక్కసుతో నే పట్టాభి తో అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు చేయించాడన్నారు.
జగన్ ను పట్టాభి తో అనుచిత వ్యాఖ్యలు చేయించడం బాధాకరం. రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదనే చంద్రబాబు పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలు పై కోర్టులో వేసి నిలుపుదల చేశారని ఆరోపించారు. పేదల ఇండ్ల నిర్మాణాలను అడ్డుకున్న చంద్రబాబుకు త్వరలో ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు. చంద్ర బాబు అవసరానికి పార్టీలను వాడుకుని వదిలేసే మనస్తత్వం కలవారన్నారు. రాబోయే రోజులలో చంద్రబాబు తీరు మార్చుకొక పోతే చంద్రబాబుకు ఆయన తనయుడు లోకేష్ కు చీపురు దెబ్బలు తప్పవన్నారు.