చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన మినీ మహానాడులో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని తిరిగి కాపాడుకునే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని దోచుకున్న వైసీపీకి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందన్నారు. లేని సమస్యలు సృష్టించి మరీ అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తాను సభ రాకుండా అక్రమ కేసుకు పెడుతారా.. వైసీపీ దొంగల్లారా… తాను కనుకగా కన్నెర్ర చేస్తే ఇంటిలో నుండి బయటకు కూడా రాలేరన్నారు.…
ప్రధాని మోడీ పర్యటన విజయవంతం అయ్యిందని.. భీమవరం కార్యక్రమం విజయవంతం కావడంతో భీమ్లానాయక్ గారు బిగుసుకుపోయారు.. చంద్రబాబు నీరుగారిపోయారు అంటూ సెటైర్లు వేశారు మంత్రి ఆర్కే రోజా
సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ వేధింపులు సరికాదని డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఈ సందర్భంగా గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను అక్రమంగా అదుపులోకి తీసుకుని సీఐడీ పోలీసులు వేధించారని లేఖలో ఆరోపించారు. అర్ధరాత్రి గోడలు దూకి తలుపులు పగలగొట్టి నోటీసుల పేరుతో వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్న సమయంలో అక్రమంగా ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేశారన్నారు. అక్రమంగా కస్టడీలోకి తీసుకుని సీఐడీ…