ఏపీలో అసెంబ్లీ, మండలి సమావేశాల్లో టీడీపీ సభ్యులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. మంత్రి జోగి రమేష్ టీడీపీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ నేతలకు ప్రతిరోజూ సభలో గొడవపెట్టడమే పనిగా పెట్టుకున్నారు.. ప్రజలకు టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారు.ప్రతిపక్షం పనికిరాని పక్షంగా మారిపోయింది. దొడ్డిదారిన పారిపోయే టీడీపీ నేతలను ఏమనాలి? హెల్త్ యూనివర్శిటీ పై చర్చ కొనసాగితే తప్పేముంది? ఎన్టీఆర్ పై అంత ప్రేముంటే ఆయన్ను చెప్పులతో ,రాళ్లతో ఎందుకు కొట్టారు.
Read Also: Congress President Election: సోనియాతో సమావేశం కానున్న అశోక్ గెహ్లాట్.. జోడు పదవులు నిర్వహించే ఆలోచన
ఎన్టీఆర్ ను దోచుకుని పార్టీ లాక్కున్న వ్యక్తి చంద్రబాబు. కానీ ఎన్టీఆర్ పై నిజమైన ప్రేమ ఉన్న వ్యక్తి ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు మంత్రి జోగి రమేష్. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఒకే ఒక్కడు వైఎస్ జగన్. ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాం. నిమ్మకూరులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం పెట్టాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ పేరు చిరస్థాయిలో నిలిచిపోయేలా చేసిన వ్యక్తి జగన్ మాత్రమేనన్నారు. గెలిచినప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎన్టీఆర్ ఎందుకు గుర్తుకురారు.
ఓడిపోయినప్పుడు మాత్రమే ఎన్టీఆర్ చంద్రబాబుకు ఎందుకు గుర్తుకొస్తారు. కేంద్రంతో అంటకాగినపుడు ఎన్టీఆర్ కు భారతరత్న అడగాలని చంద్రబాబుకు ఎందుకు ఆలోచన రాలేదు. వైద్యం అభివృద్ధికి పెద్ద పీట వేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆరోగ్య శ్రీ పెట్టిందెవరు? 108,104 అందుబాటులోకి తెచ్చిందెవరు? లక్షల మంది పేదలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దిన ఒకే ఒక్క వ్యక్తి వైఎస్ఆర్. పేదలకు సేవ చేశాడు కాబట్టే హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టాలని బిల్లు తీసుకొస్తున్నాం. లోకేష్ పాదయాత్రకు వెళ్లే పరిస్థితి లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉండి…లోకేష్ తండ్రి ఏం పీకాడు. చంద్రబాబు సమయంలో ప్రజలకు ఉపయోగపడే పధకాలు ఏం పెట్టారో లోకేష్ చెప్పాలని సవాల్ విసురుతున్నా. లోకేష్ పాదయాత్ర కాదు కదా…పొర్లు దండాలు పెట్టినా ఏం చేయలేరు?