ఏపీలో బీజేపీ ప్రజాపోరు యాత్ర పేరుతో క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధం అయింది. పాదయాత్రల ద్వారా జనంలోకి వెళ్ళాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రజా పోరు పేరుతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ను ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు దాటింది రాష్ట్రంలో అభివృధి లేదు. విజయవాడ ఆంధ్ర రాష్ట్రానికి రాజకీయాలను మలుపు తిప్పే సెంటర్. జగన్ సిఎం అయ్యాక ప్రజల్లో లేరు. ఒక్క సారి కూడా సెక్రటేరియట్ కు వెళ్ళలేదన్నారు సోము వీర్రాజు.
Read Also:Kurnool constituency : ఆ ఇద్దరి మధ్య మళ్ళీ గ్యాప్ పెరిగినట్టేనా..?
అసెంబ్లీకి అప్పుడపుడు వెళ్తారు, అబద్ధాలు చెప్తారు. ఇసుక సమృద్దిగా వున్న తక్కువ ధరకు మాత్రం రాదు. జగన్ ఒక అబద్ధాల కోరు. టీడీపీలో ఇసుక చౌక…. ప్రస్తుతం బంగారం కంటే అధిక ధర పలుకుతుంది. సిమెంట్ ఫ్యాక్టరీ వుందని…. సిమెంట్ ధర పెంచారు. పసుపు కుంకుమ పేరుతో 35 వేల కోట్లు ఖర్చుపెట్టిన చంద్రబాబు… రాజధాని మాత్రం కట్టలేదు. రాజధాని ప్రాంతంలో ఇళ్లు కట్టి మూడు రాజధానులు అంటాడు జగన్. ఎయిమ్స్ లో మంచినీళ్ళు ఇవ్వనీ పరిస్థితి…. మంచినీళ్ళు ఇవ్వకుంటే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తాం అన్నారు.
వాలంటిర్లను పేట్టి ఓట్లు వేయించుకుంటున్నారు. కేంద్ర పథకాలకు స్టిక్కర్ వేసుకుని జగనన్న ఒడి, జగనన్న తడి అంటున్నారు,జగన్ ఒక స్టిక్కర్ బాబు. 2024లో రెండు కుటుంబ పార్టీలను రాష్ట్రంలో తరిమేస్తం అన్నారు సోము వీర్రాజు. మల్లాది విష్ణు, వెల్లంపల్లి టీవీల్లో డిబెట్లు కాదు దమ్ముంటే ధైర్యంగా మా దగ్గరికి రా…. ఏం అభివృద్ధి చేశామో చెప్తాం… వచ్చే దమ్ము వుందా? అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెబుతున్నాడు. పోలవరం నిర్వాసితుల సర్వే చేయలేదు…. సర్వే చేస్తే నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా వున్నాం అని స్పష్టం చేశారు సోము వీర్రాజు.
Read Also: Manish Sisodia : ఈడీ లక్ష్యం మద్యం పాలసీనా లేదా ఎంసీడీ ఎన్నికలా..?