అనుమతి తీసుకుని పోలవరంలో ఎవరైనా పర్యటించవచ్చని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పద్దతి లేకుండా, తోకలేని కోతుల్లా ప్రాజెక్టులోకి వెళ్తామంటే ఉపేక్షించమని మంత్రి హెచ్చరించారు.
చంద్రబాబు పీ-4 మంత్రం చెబుతున్నారని.. మంత్రాలు కాదు కావాల్సింది, శక్తి యుక్తి కావాలని మంత్రి జోగి రమేష్ విమర్శలు గుప్పించారు. జగన్ పేదవాళ్ల పక్షాన నిలబడతాడు.. పేదలను నిలబెడతారని మంత్రి పేర్కొన్నారు.
చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తాడే తప్ప ఎప్పుడు కూడా సింగిల్‌గా వచ్చింది లేదన్నారు.
ఉద్యోగుల పట్ల ఇలాంటి సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం గతంలో లేదు అంటూ సీఎం వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించారు మాజీ మంత్రి పేర్నినాని.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను సీఎం జగన్ అమలు చేశారన్న ఆయన.. సీపీఎస్ విధానంలో ఉద్యోగికి రూ. 400 పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని మచిలీపట్నంలో పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.. ఇప్పుడు సీపీఎస్ ను రద్దు చేసి జీపీఎస్ ను…
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చాలా కాలం అనంతరం చంద్రబాబు అమిత్ షాతో భేటీ కావడం, ఇవాళ ప్రధాని మోదీని కలుస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు, లోకేష్ తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని.. చంద్రబాబు మాటలు పగటి కలల్లా ఉంటాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.