ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేసి టీడీపీ ఆధ్వర్యంలో ఎస్సీ సభను నిర్వహించారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. గతంలో చంద్రబాబు మాదిగలకు ఏం చేశాడని ప్రశ్నించారు. గతంలో మాదిగలు సభలు పెట్టుకుంటే చంద్రబాబు అడ్డుకుని కేసులు పెట్టారని ఆరోపించారు.
నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో ఎంతో హైప్ క్రీయేట్ చేసి ఈ యాత్ర.. నెల్లూరులో అడుగుపెట్టేసరికి యువగళం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు.
ఎన్ని రాజకీయ పార్టీలు ఒక్కటైనా ఒంటరిగానే పోటీ చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 2014లో లానే మళ్ళీ 2024లో కలిసి పోటీ చేస్తారు ఏమో అంటూ విపక్షాలను ఉద్దేశించి చెప్పుకొచ్చారు.
Gorantla Butchaiah Chowdary: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఈ సారి టికెట్ వచ్చేది ఎవరికి? సిట్టింగ్లకు అవకాశం ఉంటుందా? ఉండదా? అనే చర్చ సాగుతోంది.. అయితే, వచ్చే ఎన్నికలలో టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టిక్కెట్లు ఇస్తారని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు , రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా చెప్పినట్లు తెలిపారు. రాజమండ్రి రూరల్ టికెట్టు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారని…