Perni Nani: వైఎస్ జగన్ మాట ఇచ్చారు.. అది రద్దు చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: ఉద్యోగుల పట్ల ఇలాంటి సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం గతంలో లేదు అంటూ సీఎం వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించారు మాజీ మంత్రి పేర్నినాని.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను సీఎం జగన్ అమలు చేశారన్న ఆయన.. సీపీఎస్ విధానంలో ఉద్యోగికి రూ. 400 పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని మచిలీపట్నంలో పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.. ఇప్పుడు సీపీఎస్ ను రద్దు చేసి జీపీఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని తెలిపారు. పే కమిషన్ వేసేందుకు గతంలో ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఉండేది.. కానీ, రోడ్డెక్కి ఉద్యమం చేయకుండా గతంలో ఏ ప్రభుత్వమూ పీఆర్సీ కమిటీ నియామకం చేయలేదని.. ఏ ఉద్యోగీ రోడ్డెక్కకుండానే 12వ పీఆర్సీని సీఎం జగన్ ప్రకటించారని గుర్తుచేశారు.
Read Also: WTC FINAL 2023: ఇది ఐపీఎల్ కాదు ఐసీసీ.. ఒక్క ఇన్సింగ్స్ తో క్రేజ్ ఢమాల్..?
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు పేర్నినాని.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను రెగ్యులర్ చేస్తున్నారన్న ఆయన.. ఉద్యోగుల పట్ల ఇంతగా సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం గతంలో ఏదీ లేదన్నారు.. రాజకీయం కోసం తెలంగాణలో ఎవరో సీఎం చేశారని ఇక్కడ చేయడం లేదని స్పష్టం చేశారు.. వైద్య విధాన పరిషత్ లో పనిచేసే ఉద్యోగులు గతంలో చాలా కష్టాలు పడేవారు.. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు పెన్షన్ రావాలంటేనే నరకం చూసేవారన్నారు.. రాష్ట్రంలో 13 వేల మంది వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపారని వెల్లడించారు..
Read Also: Sini Shetty: మిస్ వరల్డ్ 2023లో భారత తరుపున “సినీ శెట్టి” ప్రాతినిధ్యం.. అసలెవరీ సినీ షెట్టి..
ఇక, పాదయాత్ర చేస్తోన్న నారా లోకేష్ ప్రజా ప్రతినిధి కూడా కాదు.. చంద్రబాబు కుమారుడికి భద్రత కరవైందని గవర్నర్ కు ఫిర్యాదు చేశారని ఎద్దేవా చేశారు పేర్ని నాని.. నోటికొచ్చినట్లుగా భద్రతా సిబ్బందిని లోకేష్ మాట్లాడుతున్నారు.. మాజీ ముఖ్యమంత్రి కుమారుడికి ఇవ్వాల్సినంత దానికంటే ఎక్కువగానే భద్రతను ప్రభుత్వం ఇచ్చిందని స్పష్టం చేశారు.. టీడీపీ వాళ్లే సెల్ఫీ ఇవ్వలేదని లోకేష్‌ను కోడిగుడ్లతో కొట్టారన్న ఆయన.. చంద్రబాబు కుమారుడికి బ్లాక్ క్యాట్ కమాండోలు ఇవ్వాలని అంటున్నారా? అర్థం కావడం లేదు అంటూ ఎద్దేవా చేశారు.. మరోవైపు.. టీడీపీ అధ్యక్షుడిగా వర్ల రామయ్య ఎందుకు ఉండకూకూడదు..? అని ప్రశ్నించారు. ఉచిత సలహాలు ఇచ్చే విధానాన్ని వర్ల రామయ్య మానుకోవాలని హితవుపలికారు.. జనంలో క్రెడిబులిటీ సంపాదించేందుకు ఏం చేయాలో చంద్రబాబుకు వర్ల రామయ్య సలహాలివ్వాలని సూచించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!