స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్కు ఆయన సతీమణి భువనేశ్వరికి జైలు అధికారులు అనుమతి తిరస్కరించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కలిసే వస్తామని ఆయన ప్రకటించారు. చంద్రబాబుతో ములాఖత్ ఏపీ రాజకీయాల్లో కీలకమైందని, వైసీపీ అరాచకాలను సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 20కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు, ప్రభుత్వ తరపున న్యాయవాదులు వాయిదా కోరటంతో న్యాయస్థానం వాయిదా వేసింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.. అయితే, ములాఖత్లో చంద్రబాబును కలిసేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఇక నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ కలవబోతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది. అంగల్లు ఘటనలో ఏ1 గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు విచారణకు లిస్ట్ అయింది.
Nandamuri Ramakrishna Fires on Ys Jagan over Chandrababu Arrest: చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొనలేకనే అక్రమంగా కేసు నమోదు చేశారని దివంగత ఎన్టీఆర్ కుమారుడు, నారా భువనేశ్వరి సోదరుడు నందమూరి రామకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు పేద విద్యార్ధులకు మెరుగైన ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే జగన్ రెడ్డి కిల్ డెవలప్మెంట్ సిద్ధాంతంతో యువత జీవితాలు నాశనం చేస్తున్నాడని నందమూరి రామకృష్ణ విమర్శించారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో నిర్వహించిన రిలే…