Posani Krishna Murali: చంద్రబాబుపై హాట్ కామెంట్లు.. బ్రహ్మణికి కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Posani Krishna Murali: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుపై హాట్ కామెంట్లు చేశారు పోసాని కృష్ణ మురళి.. ఇదే సమయంలో.. ఆయన కోడలు నారా బ్రహ్మణి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు.. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పును ఒప్పుకోవాలి.. చంద్రబాబు ఏడాది పాటు జైలులో ఉండి బయటకు వచ్చే టప్పుడు నిజాయతీగా వస్తే మాకు అభ్యతరం లేదన్నారు. చంద్రబాబు గతంలో 17 సార్లు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు ఏటీఎంగా మారిందని గతంలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని గుర్తుచేశారు. మరోవైపు.. చంద్రబాబుకు దోమ తెరలు, ఏసీ ఏర్పాటుపై చర్చ సాగుతోన్న తరుణంలో.. చంద్రబాబుకు దోమలు కరుస్తుంటే.. దోమల మందు, ఏసీ, దోమల తెరలను నేను కొనిస్తా.. ఇచ్చిరండి అంటూ టీడీపీ నేతలకు సలహా ఇచ్చారు.. ఇక, నారా బ్రహ్మణి మాటలు విని నవ్వుకోవాలంటూ సెటైర్లు వేశారు.. బ్రాహ్మణి మాటలు వింటే జడ్జి మీద కూడా కేసులు పెట్టాలేమో అని కౌంటర్ ఇచ్చారు.. బ్రాహ్మణి నేను అడిగే నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. మీ తాతయ్యను వెన్నుపోటు పొడిచిందెవరు? మీ తాతయ్యను చెప్పుతో కొట్టిందెవరు? మీ తాతయ్యను చంపిందెవరు ? బ్రహ్మణి చెప్పాలి అంటూ సవాల్ చేశారు పోసాని కృష్ణమురళి.
ఏదిక్కైనా వెళ్లండి బాగుపడతారు.. దిక్కుమాలిన చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండి అని సలహా ఇచ్చారు పోసాని.. రామారావును వెన్నుపోటు పొడిచావు ఒప్పుకోవు.. రామారావును చంపావు ఒప్పుకోవు.. రామారావును వెన్నుపోటు పొడిచింది కూడా ప్రజలకోసమే అంటే ఎలా? అని ప్రశ్నించారు. 23 మంది ఎమ్మెల్యేలను డబ్బిచ్చి కొన్నది కూడా ప్రజలకోసమేనా..? అవినీతి పనులు చేస్తే జైల్లోనే పెడతారు.. జైల్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఏడాదో.. ఏడాదిన్నరో ఉండొచ్చు కదా? జైల్లో ఉండి ర్యాలీలు.. ధర్నాలతో నీకేం పని అని నిలదీశారు. 17 సార్లు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్నావ్.. దేశంలో ఎవరికీ ఇన్ని స్టేలు లేవన్నారు పోసాని కృష్ణ మురళి.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
ఇక, ఐ అండ్ పీఆర్ కమీషనర్ విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 22వ నంది నాటకోత్సవలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మొత్తం 115 ఎంట్రీలు వచ్చాయి.. అందులోంచి 38 ఫైనల్ కు ఎంపిక చేశారు.. 12 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా స్క్రూటినీ చేశాం.. మొత్తం 73 అవార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. పద్యనాటకానికి రూ.50 వేలు, సోషల్ ప్లే కి రూ. 40 వేలు, సోషల్ ప్లే లెట్ లకు రూ. 25 వేలు, చిల్డ్రన్ ప్లే లెట్ లకు రూ. 25 వేలు, కాలేజీ యూనివర్సిటీ ప్లే లెట్ లు రూ. 25 వేలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మరోవైపు.. సీల్డ్ కవర్ లో ఫైనలిస్టుల జాబితా తీసుకొచ్చి వారే చెపుతారు జ్యూరీలు.. ఫైనల్ కోసం ముగ్గురు జడ్జిలను గుర్తిస్తున్నాం అని ఏపీ చలనచిత్ర సినిమా టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్ధ చైర్మన్ పోసాని కృష్ణమురళి.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!