చంద్రబాబు రెండో రోజు మొదటి సెషన్ సీఐడీ అధికారుల విచారణ ముగిసింది. ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. అయితే, సీఐడీ అధికారులకు మరొక మూడున్నర గంటలు మాత్రమే మిగిలి ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రంగాలు కుదేలౌతుంటే ఆధారాలు లేని స్కాముల పేరుతో సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. అర్థాంతరంగా అరెస్టు చేసి, కోర్టుల ముందు అబద్దాలు పెట్టి చంద్రబాబు నిర్భందాన్ని కొనసాగిస్తున్నారు.
అవినీతి కేసుల్లో పదేళ్లు బెయిల్‌పై బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి, ప్రజాసేవకుడైన చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం మున్ముందు ఎలా ముందుకెళ్లాలో తానే కొత్త దారి చూపించాడని ఆయన వ్యాఖ్యానించారు.
ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వస్తున్న చంద్రబాబు పక్కా ఆధారాలతో దొరికిపోయారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. చంద్రబాబు పాపం ఇన్నాళ్లకు పండిందన్నారు. చంద్రబాబు స్లీపర్ సెల్స్ చచ్చిపోతూ వస్తున్నాయని.. ఇవాళ అడ్డగోలుగా దొరికారని ఆయన వ్యాఖ్యానించారు.
స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. రెండ్రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు చంద్రబాబును విచారించనున్నారు.
ప్రతిపక్ష టీడీపీ ఒక పథకం ప్రకారం సభా సమయాన్ని వృథా చేస్తుందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ చంద్రబాబుపై కేసు ఎత్తేయాలని రచ్చ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రెండు రోజులుగా సభలో టీడీపీ అసభ్యంగా ప్రవర్తిస్తుందని ఆయన విమర్శించారు.