చంద్రబాబు మాట్లాడుతూ.. ఇవాళ్టీ నుంచి 87 రోజులే.. కౌంట్ డౌన్ ప్రారంభమైంది.. లెక్క పెట్టుకోండి అని పేర్కొన్నారు. దేవతల రాజధానిని రాక్షసులు చెరపట్టినట్టు.. అమరావతిని వైసీపీ చెరబట్టింది.. అమరావతే మన రాజధాని.. త్వరలో ఇక్కడ నుంచే పేదల పాలన మొదలు కాబోతోంది.
హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరు నాన్ లోకల్ నేతలు భోగి వేస్తున్నారు అని ఆమె విమర్శలు గుప్పించారు. భోగి పండగ, 2024 ఎన్నికలు అవ్వగానే మళ్ళీ హైదరాబాద్ కు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వెళ్ళిపోతారు.. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు, పవన్ లను తగలబెట్టి, తరిమేయండి అని మంత్రి రోజా పిలుపునిచ్చారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని వీడుతున్న వారందరూ చంద్రబాబు కోవర్టులే.. ముందు నుంచి చంద్రబాబుతో టచ్లో ఉన్నారని ఆయన ఆరోపించారు. వైసీపీలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్కళ్యాణ్ తొలిసారిగా వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, సీట్ల సర్దుబాటు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణపై నేతలు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి విడత చర్చలు పూర్తి అయిన సంగతి తెలిసిందే.
తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 5 ఏళ్ల రాతి యుగపాలనకు ముగింపు పలికి.. స్వర్ణయుగానికి నాంది పలికేలా సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని ఆయన అన్నారు. చేయి చేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనిద్దామన్నారు.