ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తొలిసారిగా వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, సీట్ల సర్దుబాటు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణపై నేతలు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి విడత చర్చలు పూర్తి అయిన సంగతి తెలిసిందే.
తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 5 ఏళ్ల రాతి యుగపాలనకు ముగింపు పలికి.. స్వర్ణయుగానికి నాంది పలికేలా సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని ఆయన అన్నారు. చేయి చేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనిద్దామన్నారు.
కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు చంద్రబాబు నివాసంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు లోకేష్‌ను కలిశారు. కేశినేని నాని పార్టీ వీడిన తర్వాత జరుగుతోన్న పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది.