ఎంపీ కేశినేని నాని.. టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. విజయవాడ ద్రోహి చంద్రబాబు.. పొరపాటున కూడా గెలవడు అని జోస్యం చెప్పారు.. విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా బయటపెట్టారు.. టీడీపీకి 54 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయని స్పష్టం చేశారు.
నాకుటుంబంలో చిచ్చు పెట్టారు. నన్ను చాలా రకాలుగా అవమానించారు అంటూ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన తర్వాత కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఆ కామెంట్లకు అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్‌కు దిగారు టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని.. మా కుటుంబ కలహాలు 1999 ఉంచి ఉన్నాయి.. కొనసాగుతూనే ఉన్నాయి.. వాటితో చంద్రబాబుకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. నాని నన్ను ఎన్ని అన్నా 1999 ఉంచి నేనే సద్దుకుంటూ పోతున్నాను అని వెల్లడించారు.
చంద్రబాబు సభలో జనం లేక, ఖాళీ కుర్చీలను చూసి పిచ్చిపట్టి మాట్లాడుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు 'రా కదలిరా' బహిరంగ సభ అట్టర్‌ప్లాప్ అయ్యిందన్నారు. ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మడం లేదని ఆయన అన్నారు.
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు విచారణ… రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై నేడు మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు ను తప్పుదోవ పట్టించారా లేదా.. అని చెన్నమనేని ప్రశ్నించిన హైకోర్టు… కోర్టు ను తప్పుదోవ పట్టించునే వాళ్లకు ఉపషమనం ఎందుకు కల్పించాలని వ్యాఖ్యానించింది. 2018 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో జర్మనీ పౌరసత్వం తో పోటీ చేసారన్న హైకోర్టు.. జర్మనీ పౌరసత్వం తోనే ఇంకా ప్రయాణాలు చేస్తున్నారా…
ముఖ్యమంత్రి పదవి కోసం, పవన్‌కు అధికారము కోసం ఈ పోరాటం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తునిలో 'రా కదలిరా' బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో రాజకీయం మారిపోయిందని ఆయన అన్నారు. జగన్ పని అయిపోయిందని.. జీవితంలో పోటీ చేసే పరిస్థితి లేదన్నారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్‌తో కీలక భేటీ అనంతరం కేశినాని నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను టీడీపీలో తీవ్రంగా అవమానించారని, తన రాజీనామాను ఆమోదించిన అనంతరం వైసీపీలో చేరతానని ఆయన తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.