చంద్రబాబుపై కేసు నమోదు, విచారణ, రిమాండ్, అరెస్టు అన్నీ సక్రమమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కానీ కొందరు చంద్రబాబుకు భారీ ఊరటని చెబుతున్నారని, కోర్టు దోషి అని చెప్పినా ఊరట అని వీళ్ళు అంటున్నారని మంత్రి అన్నారు.
మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలన ముగుస్తుందని జోస్యం చెప్పారు టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నీతి, నిజాయితీతో పుట్టిన టీడీపీకి నేనొక పిల్లర్ లాంటి వాడిని.. అలాంటి నేను పార్టీ మారతాను అని ఎలా అంటారు? అని ప్రశ్నించారు.
చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A సుప్రీం కోర్టు భిన్నాభిప్రాయాలు పై సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A వర్తిస్తాదా, వర్తించదా అనే అంశంపై ఈరోజు తీర్పు రావాల్సి ఉన్నా.. సుప్రీం కోర్టులోనే త్రిసభ్య న్యాయమూర్తులలో భిన్నభిప్రాయాలు వెలువడిందని, ముమ్మాటికి ఇందులో రాజకీయ జోక్యం చోటుచేసుకుందని వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడనుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీం కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు 17ఏపై దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.
దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా దొంగ ఓట్లు సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్చడం, టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లపై ధర్నా చేస్తున్న సమయంలో గాయపడిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నానిని చంద్రబాబు పరామర్శించారు.
ఈ సారి మంత్రాలయం టికెట్ నాదే.. గెలుపు నాదే అంటున్నారు మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి.. ఈ ప్రభుత్వ హయాంలో మంత్రాలయంలో అభివృద్ధికి నోచుకోలేదు.. తాను విజయం సాధించి అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తాఅంటున్నారు.