CM Chandrababu : సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మొంథా తుఫాను సమయంలో క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసినందుకు మంత్రులను సీఎం చంద్రబాబు అభినందించారు. ప్రతీ మంత్రి స్వయంగా ప్రాంతాల్లో ఉండి ప్రజలకు వేగంగా సహాయం అందేలా చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. మొంథా తుఫాను సమయంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వల్లే సహాయక చర్యలు అత్యంత వేగంగా జరిగాయని తెలిపారు సీఎం చంద్రబాబు.
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు ఈవీఎమ్‌లు ఏర్పాట్లు !
ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ, టెక్నాలజీ వినియోగంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంత్రులు, అధికారులు టీం స్పిరిట్‌తో పనిచేయడం ఈ ఫలితాలకు ప్రధాన కారణమని చంద్రబాబు పేర్కొన్నారు. తుఫాను సమయంలో అందరూ ఎలా కష్టపడ్డారో తాను ప్రత్యక్షంగా గమనించినట్టు వెల్లడించారు.