AP Cabinet Decisions : రాష్ట్రంలో భారీ పెట్టుబడుల దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మొత్తం రూ. లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ముఖ్యంగా క్వాంటం కంప్యూటింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో 70 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
Stampades : దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు కీలక నిర్ణయం
రాష్ట్రాన్ని క్వాంటం కంప్యూటింగ్ సంస్థలు, నిపుణులు, స్టార్టప్‌లకు కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు. ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి రాబట్టాలని, సుమారు ఐదు వేల మంది నిపుణులు, స్టార్టప్‌లు ఏపీకి రావొచ్చని అంచనా వేశారు. పరిశ్రమల విస్తరణ దిశగా కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖలో రహేజా సంస్థ కొత్త పరిశ్రమను ఏర్పాటు చేసే దిశగా ఆమోదం లభించింది. కాపులుప్పాడ, తిరుపతి, ఓర్వకల్లులో పరిశ్రమల ఏర్పాటుకు కూడా అనుమతి ఇచ్చారు. ఓర్వకల్లులో డ్రోన్ ఇండస్ట్రీలను ఏర్పాటు చేయడానికి 50 ఎకరాలు కేటాయించగా.. నెల్లూరులో ఫైబర్ సిమెంట్ ప్లాంట్ కోసం బిర్లా గ్రూప్‌కు భూమిని కేటాయించారు. అదేవిధంగా సిగాచి ఇండస్ట్రియల్ లిమిటెడ్ సింథటిక్ ఆర్గానిక్ ప్లాంట్ కోసం 100 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలో డోస్కో ఇండియా లిమిటెడ్ కోసం 150 ఎకరాలు కేటాయించారు.
అభివృద్ధి పైనే దృష్టి పెట్టిన కేబినెట్ కృష్ణా జిల్లా బాపులపాడులో 40 ఎకరాల్లో వేద ఇన్నోవేషన్ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అనంతపురంలో టీఎంటీ బార్ ప్లాంట్ కోసం 300 ఎకరాలకుపైగా భూమి కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ అనుసంధాన స్పేర్ వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ, ప్రతి మండలంలో 20-30 వర్క్ స్టేషన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ స్టేషన్లను ఏర్పాటు చేసే సంస్థలకు ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందించనుంది. ఐటీ రంగం విస్తరణకు భాగంగా విశాఖలో ఐటీ సంస్థల ఏర్పాటు ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది. విశాఖలో రియాల్టీ లిమిటెడ్ ద్వారా ఐటీ పార్క్ నిర్మాణానికి కేబినెట్ అనుమతి తెలిపింది.
Dinosaur: ఉత్తరప్రదేశ్‌లో 40 మిలియన్ల సంవత్సరాల నాటి డైనోసార్ శిలాజం లభ్యం..