Byreddy Siddhartha Reddy : చిన్న బాబు దెబ్బకి పెద్దబాబు బలి కాబోతున్నాడు
- కూటమి అధికారంలోకి వచ్చాక జగన్ పై మోపిన అతిపెద్ద నింద లిక్కర్ స్కాం
- కూటమి వచ్చాక సొంత డిస్టలరీలు పెట్టి మద్యం తయారు చేస్తే తప్పు కాదు
- చిన్న బాబు దెబ్బకి పెద్దబాబు బలి కాబోతున్నాడు
- జనార్దన్ రావు కాల్ డేటా ఎందుకు తీయడం లేదు : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేయించలేకపోయాడని విమర్శించారు. “జగన్ ఏ మంచి కార్యక్రమం చేపట్టినా చంద్రబాబు ఒక్కరోజైనా అభినందించాడా? రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తెలుగుకి అన్యాయం అంటాడు. మేము 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించుకున్నాం, కానీ అవన్నీ పూర్తయ్యే దశలో ఉన్నా కూటమి ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తోంది,” అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విమర్శించారు.
వైఎస్సార్‌సీపీ ఇమేజ్‌ను డామేజ్ చేయడం తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కూటమికి లేదని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యానించారు. “85% పనులు పూర్తైన మెడికల్ కాలేజీలను చూపకుండా 15% మాత్రమే చూపించి ఏదో జరిగిపోయిందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు,” అని తెలిపారు. “ఇప్పుడు తమకంటూ సొంత డిస్టిలరీలు పెట్టుకుని మద్యం తయారు చేస్తే తప్పు కాదని చెబుతున్నారు. తెలుగు దేశం నాయకులు గ్రామాల నుంచి మండలాల వరకు మద్యం సరఫరా చేసి దానిని ఆదాయ వనరుగా మార్చుకున్నారు,” అని మండిపడ్డారు.
Also Read
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
వరదలు వస్తే ప్రజలు బాధపడతారని, కానీ కూటమి నేతలు మాత్రం కేంద్రం నుంచి వచ్చే నిధులపై స్కామ్ చేసే ఆలోచనతో సంతోషపడుతున్నారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఈ కూటమి ప్రభుత్వం గ్రాఫ్ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పడిపోతుంది,” అని అన్నారు. “చిన్న బాబు దెబ్బకి పెద్ద బాబు బలి కాబోతున్నాడు,” అంటూ సిద్ధార్థ రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అలాగే, “జనార్దన్ రావు కాల్ డేటా ఎందుకు తీయడం లేదు? తీస్తే తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్సీల గుట్టు బయటపడుతుంది. వారికి సంబంధం లేదని రుజువు చేస్తే మేము రాజకీయాలు వదులుకుంటాం,” అని సవాల్ విసిరారు. “అన్యాయంగా కేసుల్లో పెడితే ప్రజల్లో సింపతి వస్తుంది. ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవుతాడు.. జాక్‌పాట్ కొట్టినట్లే,” అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు.
Murder : జగద్గిరిగుట్టలో రౌడీషీటర్‌పై దారుణ హత్య.. ఛేదించిన పోలీసులు
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..