CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, కేబినెట్ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, కీలక ప్రాజెక్టులు, వైద్య రంగం, రాజధాని పురోగతి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు మాట్లాడుతూ, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు అని వెల్లడించారు. అమరావతి అభివృద్ధి వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి…
CM Chandrababu: కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పెండ్లిమర్రిలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను విడుదల చేశారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో మంత్రులకు అభినందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మొంథా తుఫాన్ సమయంలో క్షేత్ర స్థాయిలో బాగా పనిచేశారని మంత్రులను ప్రత్యేకంగా అభినందించారు.. ప్రతి ఒక్కరూ క్షేత్ర స్థాయిలో ఉండి.. ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారని పేర్కొన్నారు.. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయడం వల్లనే తుఫాన్ సహాయక చర్యలు వేగంగా అందాయని తెలిపారు.. ఇక, ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతర…
CM Chandrababu: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ దగ్గర బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసింది.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ లో అద్భుతంగా అధికారులు పని చేశారని ప్రశంసించారు. ముందు జాగ్రత్త చర్యలతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించామన్నారు.
Chandrababu Naidu: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడులో తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు హత్యపై సీఎం చంద్రబాబు హోంమంత్రిని నివేదిక కోరారు. కూటమి నేతలతో కలిసి రాళ్లపాడు వెళ్లి ఘటనపై నివేదిక ఇవ్వాలని హోం మంత్రి అనితను ఆదేశించారు. తన సోదరులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న లక్ష్మీనాయుడును కొద్దిరోజుల క్రితం అదే గ్రామానికి చెందిన హరిచంద్రప్రసాద్ కారుతో గుద్ది చంపాడు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు పోలీసులు..
Fire Accident: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అనపర్తి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై తాజాగా సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా…