CM Chandrababu: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ దగ్గర బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసింది.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు కోరారు.
Read Also: Tamil Nadu: ప్రియురాలు పదే పదే ఆ ప్రస్తావన తేవడంతో ప్రియుడు ఏం చేశాడంటే..!
అయితే, చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 24కి చేరుకుంది. ఈ ప్రమాదంలో 40 మంది గాయపడగా వారిలో సుమారు 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా, ఇప్పటికే 24 మంది చనిపోయినట్లు గుర్తించిన అధికారులు.. చేవెళ్ల ఆస్పత్రిలో మరో 10 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇక, పరిస్థితి విషమంగా ఉన్న వారిని నిమ్స్, గాంధీ ఆస్పత్రులకి తరలించారు. అయితే, మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తనుషా, సాయి ప్రియ, నందిని మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. మృతులు తాండూరు పట్టణంలోని వడ్డెర గల్లీకి చెందిన వారిగా అధికారులు గుర్తించారు.