Family Benefit Card in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ‘ఫామిలీ బెనిఫిట్ కార్డ్’ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ కార్డ్ తరహాలోనే బెనిఫిట్ కార్డ్ ఉండనుంది. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్కీంలు సహా అన్ని వివరాలను ఫ్యామిలీ కార్డులో పొందుపరచనుంది. ప్రభుత్వం త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని సమీక్షలో…
CM Chandrababu: పార్టీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పలువురికి ఆర్థిక సాయం నిధులు చేశారు. అనంతరం నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించారు. అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్‌చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై పూర్తి అప్రమత్తతో ఉన్నామన్నారు.
Chandrababu Naidu’s Bail and Petition Tomorrow: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. రెండు పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి తెలిపారు. బెయిల్ పిటిషన్‌పై ఈరోజు తమ వాదనలు వినాలని బాబు తరఫు లాయర్లు కోరారు. ఈరోజు వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమని ఏసీబీ కోర్టు జడ్జి అభిప్రాయపడ్డారు. బుధవారం నుంచి తాను సెలవులపై…
Nara Chandrababu Naidu Petition Today in Supreme Court: మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ స్కామ్ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ బాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. తన పిటిషన్‌ను…