ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా కరాచీలోని నేషనల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించి సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 29.1 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(27), ట్రిస్టన్ స్టబ్స్(0) విఫలమైనా.. రాసీ వాన్ డెర్ డస్సెన్(87 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 నాటౌట్), హెన్రీచ్ క్లాసెన్(56 బంతుల్లో 11 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీలతో రాణించారు.
Also Read: Elon Musk: అమెరికా తదుపరి అధ్యక్షుడు ఆయనే.. మస్క్ సంచలన పోస్ట్
ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ ఒక్కడే 2 వికెట్లు తీసాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 38.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లీష్ బ్యాటర్లు సౌతాఫ్రికా బౌలర్ల ముందు తేలిపోయారు. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో అత్యధికంగా జో రూట్ 37 పరుగులు చేశాడు. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ 25, బెన్ డకెట్ 24, జోస్ బట్లర్ 21, హ్యారీ బ్రూక్ 19 పరుగులు చేశారు. సౌతాఫ్రికా అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లను మడతపెట్టేశారు. మార్కో జన్‌సన్, వియాన్ మల్డర్ చెరో 3 వికెట్లు తీశారు. కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు పడగొట్టగా.. లుంగీ ఎంగిడి, కగిసో రబాడా తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.