ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్‌పై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. ఇది భారత్‌కు మూడవ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. ఈ విజయం తర్వాత భారత ఆటగాళ్ల పంట పండింది. వారికి భారీ మొత్తంలో ప్రైజ్ మనీ లభించింది. టీమిండియాలోని ప్రతి సభ్యుడికి కోటి రూపాయలకు పైగా ప్రైజ్ మనీ లభించింది. అంతేకాకుండా.. ఈ ట్రోఫీలో పాల్గొన్న ఇతర జట్లు ప్రైజ్ మనీని అందుకున్నాయి. ఏ జట్లకు ఎంత ప్రైజ్ మనీ వచ్చిందో.. ఏ ఆటగాడు ఎంత లాభపడ్డాడో తెలుసుకుందాం..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీని ప్రకటించింది. ఆ ప్రకటన ప్రకారం.. విజేత భారత జట్టుకు $2.24 మిలియన్లు, అంటే దాదాపు రూ.19.46 కోట్లు లభించాయి. అంటే ప్రతి భారతీయ ఆటగాడికి ఒక కోటి రూపాయలకు పైగా లభించింది. రన్నరప్ అయిన న్యూజిలాండ్ $1.12 మిలియన్లు, అంటే దాదాపు రూ.9.73 కోట్లు అందుకుంది. సెమీఫైనల్లో ఓడిపోయిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఒక్కొక్కటి $560,000, అంటే దాదాపు రూ.4.86 కోట్లు అందుకున్నాయి.
Read Also: Puri : మొన్న చిరంజీవి, నేడు నాగ్?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీ పంపిణీ (కోట్లలో):
ఇండియా (విజేత) – రూ.19.46 కోట్లు
న్యూజిలాండ్ (రన్నరప్) – రూ.9.73 కోట్లు
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా (సెమీ-ఫైనలిస్టులు) – రూ.4.86 కోట్లు
ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ – రూ.3.04 కోట్లు
పాకిస్తాన్, ఇంగ్లాండ్ – రూ.1.22 కోట్లు
ప్రతి గ్రూప్ దశ మ్యాచ్ విజయానికి ప్రైజ్ మనీ – రూ.29.53 లక్షలు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అవార్డులు:
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ – రచిన్ రవీంద్ర
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు – రోహిత్ శర్మ
గోల్డెన్ బాల్ అవార్డు – మాట్ హెన్రీ
గోల్డెన్ బ్యాట్ అవార్డు – రచిన్ రవీంద్ర