కేంద్ర బడ్జెట్ 2022: ధరలు పెరిగేవి? తగ్గేవి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు బడ్జెట్-2022ను ఆవిష్కరించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ప్రకారం కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. అలాగే కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. కొన్నింటిపై కస్టమ్ సుంకం తగ్గించగా.. కొన్నింటిపై కస్టమ్ సుంకం పెంచారు. అందువల్ల ధరల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ధరలు తగ్గే వస్తువుల జాబితా: మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ట్రాన్స్‌ఫార్మర్లు, వజ్రాలు, రత్నాలు, పలు రకాల ఇమిటేషన్ జ్యూవెలరీ, పెట్రోలియం పరిశ్రమల్లో ఉపయోగించే కెమికల్స్, మిథనాల్, కెమెరా లైసెన్సులు, స్టీల్ స్క్రాప్, వ్యవసాయ పరికరాలు, దుస్తులు, పాదరక్షలు, విదేశీ యంత్రాలకు సంబంధించిన సామాగ్రి, తోలు వస్తువులు
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
ధరలు పెరిగే వస్తువుల జాబితా: ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు, విదేశీ గొడుగులు, క్రిప్టో లావాదేవీలు, స్పీకర్స్, హెడ్ ఫోన్స్, ఇయర్‌ఫోన్స్, సోలార్ సెల్స్, మాడ్యూల్స్
కాగా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు తీపికబురు అందించింది. కొత్త ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఐటీఆర్‌లో తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి మరింత గడువు ఇచ్చింది. రెండేళ్ల గడువు ఇస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సాధారణంగా పన్ను చెల్లింపుదారులకు డిసెంబర్ 31 వరకు గడువు ఇస్తారు. అయితే బడ్జెట్ ప్రతిపాదన ప్రకారం చూస్తే సంబంధిత అసెస్‌మెంట్ ముగిసిన తర్వాత రెండేళ్ల వరకు గడువు లభించనుంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?