VLC Media Player: వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌పై భారత ప్రభుత్వం నిషేధం..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VLC Media Player: అత్యంత ప్రజాదరణ పొందిన మీడియా ప్లేయర్ సాఫ్ట్‌వేర్, స్ట్రీమింగ్ మీడియా సర్వర్ VLC మీడియా ప్లేయర్ ఇకపై భారతదేశంలో పని చేయదు. ఎందుకంటే VLC మీడియా ప్లేయర్‌పై భారత ప్రభుత్వం రెండు నెలల కిందటే నిషేధం విధించినట్లు తెలుస్తోంది. మన దేశంలో VLC మీడియా ప్లేయర్, డౌన్‌లోడ్ లింక్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో దాన్ని డౌన్‌లోడ్ చేసుకునేందుకు కుదరడం లేదు. చైనాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ Cicada సైబర్ అటాక్స్ జరిపేందుకు వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ను ఉపయోగించుకుంటోందని, అందుకే ఐటీ చట్టం-2000 ప్రకారం భారత ప్రభుత్వం బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Asteroids : భూమిపైకి ఆస్టరాయిడ్ల దండయాత్ర.. ఏ క్షణమైనా..
Also Read
- iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
- iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
- Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్‌ప్లే, 100W ఛార్జింగ్‌తో అదుర్స్!
- WhatsApp Guest Calling Feature: WhatsApp కొత్త ఫీచర్.. అకౌంట్ లేకుండానే వీడియో కాల్స్‌లో చేరొచ్చు.. ఎలా వాడాలంటే?
దీర్ఘకాలంగా దేశంలో కొనసాగుతున్న సైబర్ దాడుల్లో భాగంగా హానికరమైన మాల్వేర్ లోడర్‌ను అమలు చేయడానికి చైనాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ Cicada VLC మీడియా ప్లేయర్‌ను ఉపయోగిస్తోందని కొన్ని నెలల క్రితం భద్రతా నిపుణులు గుర్తించారు. అయితే ఇది సున్నితమైన అంశం కాబట్టి వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ను నిషేధిస్తున్నట్లు కంపెనీ లేదా భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ట్విట్టర్‌లోని కొంతమంది వినియోగదారులు ఇప్పటికీ వీఎల్‌సీ మీడియా ప్లేయర్ పరిమితులను కనుగొంటున్నారు. గగన్‌దీప్ సప్రా అనే వినియోగదారుడు VLC వెబ్‌సైట్‌కు సంబంధించి ఓ స్క్రీన్‌షాట్‌ను ట్వీట్ చేశాడు. అందులో అది ఐటీ చట్టం-2000 ప్రకారం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆర్డర్ ఆదేశాల మేరకు వెబ్‌సైట్ బ్లాక్ చేయబడిందని చూపిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇప్పటికే ACT Fibernet, Jio, Vodafone-ideaతో పాటు ఇతర అన్ని ప్రధాన ISPలలో VLC మీడియా ప్లేయర్ బ్లాక్ చేయబడిందని వెల్లడించారు.
#blocked
Videolan project’s website “https://t.co/rPDNPH4QeB” cannot be accessed due to an order issued by @GoI_MeitY. It is inaccessible for all the major ISPs in India including #ACT, #Airtel and V!. #WebsiteBlocking pic.twitter.com/LBKgycuTUo— sflc.in (@SFLCin) June 2, 2022
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!