India Invites American Singer to Independence Day Celebrations: భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పంద్రాగస్టు వేడుకలకు అమెరికా ప్రసిద్ధ గాయని మిల్బెన్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. ‘ఓం జయ్ జగదీశ హరే’తో పాటు ‘జనగణమన’ గీతాలు పాడిన అమెరికా గాయని మిల్బెన్ భారతీయులకు సుపరిచితురాలే. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గతంలో పలుసార్లు ఆమె గీతాలు పాడి వీడియోలు పోస్ట్ చేశారు. దీంతో అమెరికా, భారత్ మధ్య ఆమె స్నేహ వారధిలా మారారు. ఈ మేరకు ఆమెను దేశ రాజధాని ఢిల్లీలో జరిగే భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రావాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు కోరింది. అమెరికా కళాకారులను భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం ఇదే తొలిసారి.
Read Also: Rakshabandhan 2022: సోదరికి గిఫ్ట్‌ల గురించి ఆలోచిస్తున్నారా?.. ఈ బహుమతులు ఇవ్వండి
కాగా భారత్ తనకు ఆహ్వానం పంపడంపై అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి కల్చరల్ అంబాసిడర్‌గా భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వెళ్తుండడం గర్వంగా ఉందని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు భారత దేశ సంస్కృతి అంటే తనకు చాలా ఇష్టమని మేరీ మిల్బెన్ గతంలో పలు సార్లు చెప్పారు. తాను హిందీని అధ్యయనం చేయడం ద్వారా భారత దేశంపై అభిమానాన్ని పెంచుకున్నానని వెల్లడించారు. అటు గాయని మిల్బెన్ ఈ నెల 10న ఇండియా స్పోరా గ్లోబల్ ఫోరమ్‌లో మేరీ భారత జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. ఇందులో తమిళనాడుకు చెందిన పియానో కళాకారుడు లిడియన్ కూడా పాల్గొంటారు.