ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పరిగణలోకి తీసుకున్నారు. ఖరీఫ్ సీజన్లో గరిష్టంగా డిమాండ్ ఉంటుందంటూ కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. సీఎం విజ్ఞప్తిని స్వీకరించిన కేంద్ర మంత్రి.. తెలంగాణ రాష్ట్ర రైతుల డిమాండ్ ను నెరవేర్చే దిశగా ఆదేశాలు జారీ చేశారు. అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా ఉండేలా చూసుకోవాలని ఎరువుల శాఖ అధికారులను ఆదేశించారు.
పైరసీ అరికట్టేందుకు ఇండస్ట్రీ నుంచి గట్టి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు. తాజాగా తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడిన అయన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తోందన్నారు. థియేటర్స్ లో కూర్చుని సినిమా రికార్డ్ చేస్తున్న నలుగురిని ఈ మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read: Dil Raju: దిల్ రాజు కాంపౌండ్ నుంచి రానున్న సినిమాలివే! ఇలా రికార్డ్ చేసిన సినిమాలను…
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో శ్రమ్ శక్తి భవన్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల స్థితి గురించి చర్చించారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అంశంపై చర్చ జరిగింది.
ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన హామీలు అమలు చేయడం లేదంటూ గుడ్డిగా మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 3000 పెన్షన్ రూ. 4000 చేశామని తెలిపారు. అన్న క్యాంటీన్లు పెట్టామని.. మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో ముందే అకౌంట్ లో డబ్బులు వేసేస్తామని స్పష్టం చేశారు.
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ముహూర్తం ఖరారయ్యింది. బుధవారం ఉదయం 10:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుడు శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కార్యదర్శి శేషాద్రి, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జితేందర్‌తో కలిసి ప్రధానిని కలవనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా హైదరాబాద్…