CM Revanth Reddy : రేపు ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
- హైదరాబాద్ అభివృద్ధి పై రేపు సీఎం రేవంత్ - ప్రధాని మోడీ భేటీ
- మూసీ రివర్ ప్రాజెక్ట్, మెట్రో విస్తరణకు కేంద్ర సహాయం?
- కాంగ్రెస్ అధిష్టానం తో రాష్ట్ర రాజకీయాలపై కీలక చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ముహూర్తం ఖరారయ్యింది. బుధవారం ఉదయం 10:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుడు శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కార్యదర్శి శేషాద్రి, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జితేందర్‌తో కలిసి ప్రధానిని కలవనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలపై చర్చించనున్నారు.
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, మెట్రో రైలు పొడిగింపు ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం, ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంపు వంటి కీలక అంశాలపై ప్రధానిని సీఎం మెమొరాండం ద్వారా విజ్ఞప్తి చేయనున్నారు. నగరాభివృద్ధిలో భాగంగా కేంద్రం నుంచి మరిన్ని సహాయ నిధులను కోరే దిశగా ఈ భేటీ కొనసాగనున్నట్లు సమాచారం.
Also Read
Mahashivratri 2025: శివ లింగాలు ఎన్ని రకాలు.. వాటి విశిష్టత ఏంటి?
ఇక ప్రధాని మోడీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర కేబినెట్‌లోని పలువురు కీలక మంత్రులను కూడా కలవనున్నారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు మద్దతుగా కేంద్ర మంత్రుల వద్ద ప్రత్యేకంగా విజ్ఞప్తులు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఈ రాత్రికే సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ప్రధానితో సమావేశం అనంతరం కాంగ్రెస్ అధిష్టానం నేతలను కూడా రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, తెలంగాణలో కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చించే అవకాశముంది. కొత్తగా మంత్రివర్గంలో చేరబోయే నేతల ఎంపిక, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై పార్టీ పెద్దలతో ముఖ్యంగా చర్చించనున్నట్లు సమాచారం.
తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వ పాలన, కాంగ్రెస్ పార్టీ వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న ఈ పర్యటనపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అందబోయే సహాయ నిధులపై ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎంకు ప్రధాని మోడీ నుంచి ఎలాంటి హామీలు లభిస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!