లోక్‌సభ ఎన్నికల వేళ భారతదేశంలో ఓటర్లకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశంలో త్వరలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 96 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జిల్లాల వారీగా 2024 తుది ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్ సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిట్లు పేర్కొంది.
కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. గతేడాది జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అక్రమాలపై సీఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
మూడో రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్‌తో కలిసి కేంద్ర ఎన్నికల అధికారులకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం ఉండనుంది..
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం ఆంధ్రప్రదేశ్‌కి చేరుకుంది.. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ టీమ్ పర్యటన కొనసాగనుంది..
ఏపీలో రేపటి నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ఈ క్రమంలో.. రేపు ఎన్నికల అధికారుల బృందం విజయవాడ చేరుకోనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. ఈ నెల 9వ తేదీన వివిధ రాజకీయ పార్టీలతో భేటీ కానున్నారు.
ఏపీలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పీడ్ పెంచుతోంది. రాష్ట్రంలో ఎన్నికల సంసిద్ధతపై మరోమారు ఏపీ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఈ నేపధ్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ బృందం రాష్ట్రానికి రానుంది. సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ కూడా ఏపీకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. సీఎస్, డీజీపీలు సహా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం…