మాచర్ల ఈవీఎం ధ్వంసం ఘటనపై సీరియస్ అయిన సీఈసీ.. ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
మాచర్ల సంఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఈఓ ముకేష్‌కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం తాఖీదు పంపింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం సంఘటనపై ఏపీ సీఈఓను కేంద్ర ఎన్నికల సంఘం వివరణ అడిగింది.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) రియాక్షన్ మొదలయింది. డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చర్యలకు ఆదేశించింది. ఇవాళ మధ్యాహ్నం ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీలు ఇచ్చిన రిపోర్ట్‌ను ఆధారంగా చేసుకొని చర్యలు చేపట్టింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెన్షన్ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ సలహాదారులకూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్.. కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులై కేబినెట్ మంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీత భత్యాలు పొందుతున్న వారికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని పేర్కొంది..
ఎన్నికల కోడ్ ముగిసే వరకు డీఎస్సీని వాయిదా వేయాలని సీఈసీ స్పష్టం చేసేంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ పరీక్షా ఫలితాల విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఆంక్షలు విధించింది. పెన్షన్లు సహా లబ్దిదారులకు నగదు పంపిణీ వంటి కార్యక్రమాల అమలుకు వాలంటీర్లను దూరంగా పెట్టాలని సీఈసీ సూచించింది.
గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకి ఎన్నికల విధుల కేటాయింపుపై ఎన్నికల సంఘం(సీఈసీ) స్పష్టత ఇచ్చింది. ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బంది నియామకానికి సీఈసీ నో అబ్జెక్షన్ తెలిపింది.