అవినీతి, లంచగొండితనాన్ని అరికట్టేందుకు సీబీఐ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆగడాలు ఆగటం లేదు. తాజాగా.. లంచం కేసులో అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఓ), సబార్డినేట్ ఉద్యోగిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరందరినీ డ్రగ్ కంట్రోలర్ (ఇండియా) కార్యాలయంలో నియమించారు. వీరంతా లంచం తీసుకున్న ఆరోపణలపై అరెస్టు చేసి అనంతరం కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు.. ఏప్రిల్ 8 వరకు పోలీసు కస్టడీకి తరలించారు.