సొంతిల్లు కట్టుకోవాలనుకునే వారికి సిమెంట్ కంపెనీలు ఊరట కలిగించే వార్తను అందించాయి. 50 కిలోల బస్తాపై రూ.20 నుంచి రూ.40 వరకు తగ్గిస్తున్నట్లు సిమెంట్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో ఏపీ, తెలంగాణలో 50 కిలోల సిమెంట్ బస్తా ధర రూ.40 తగ్గింది. తమిళనాడులో రూ.20 తగ్గగా… కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో బస్తా ధర రూ.30 వరకు తగ్గినట్లు తెలుస్తోంది. తాజా ధరల ప్రకారం తెలుగు రాష్ట్రాలలో సిమెంట్ బస్తా బ్రాండ్‌ను బట్టి రూ.280 నుంచి రూ.320కి లభించనుంది.…
2022 ఏడాది రాకముందే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కొత్త ఏడాదిలో సిమెంట్ ధర మరింత పెరగనుంది. ప్రస్తుతం రూ.385 వరకు పలుకుతున్న 50 కిలోల సిమెంట్ బస్తా ధర మరో రూ.20 పెరగనుందని క్రిసిల్ అంచనా వేసింది. ఇదే జరిగితే గతంలో ఎన్నడూ లేని విధంగా బస్తా సిమెంట్ ధర రూ.400 దాటనుంది. సిమెంట్ తయారీ ధరలో ప్రధాన ముడి పదార్థాలైన బొగ్గు, పెట్‌కోక్‌ల ధరలు ఇటీవల విపరీతంగా పెరగడంతో త్వరలో సిమెంట్ బస్తాల ధరలు…