జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కేంద్రం ప్రభుత్వం యోచిస్తుంది. మరోవైపు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు ప్రధాని నేతృత్వం వహించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏటా నిర్వహించుకోవాలని 9 ఏళ్ల క్రితం ఇదే ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ తొలిసారి ప్రతిపాదించారు.
అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల పండుగలకు అండగా నిలుస్తున్నారు. ఈ కానుకలతోపాటు ప్రభుత్వం రూ. 6 లక్షలు, జిల్లాకు రూ. ఈస్ట్ ఫెస్ట్ నిర్వహించేందుకు ప్రత్యేక నియోజకవర్గానికి 2 లక్షలు. కాగా.. క్రిస్మస్ వేడుకల నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు.
ఇవాళ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 15వేల మందితో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్న వజ్రోత్సవ సభకు హాజరవుతారు కేటీఆర్. ఇక ఈ సభలో అర్హులైన కొత్త ఆసరా లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేయడమే కాకుండా.. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు వేములవాడ చేరుకుని, ఆలయ చెరువు మైదానంలో 15 వేల…
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది ఆదిశేషుడి నీడలో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే.. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ 67 సంవత్సరాల చరిత్రలోనే తొలిసారిగా మట్టి గణపతిని ప్రతిష్టించారు. విఘ్నేశ్వరుడి ప్రతిమ 50 అడుగుల ఎత్తు, 22 అడుగుల వెడల్పుతో మట్టి గణపతిని ప్రతిష్టించడం ఓ రికార్డు సృష్టించింది. ఇక ఉప మండపాల్లో 22 అడుగుల ఎత్తులో స్వామి వారి కుడివైపు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి.. ఎడమవైపు త్రిశక్తి మహాగాయత్రి దేవిని…
నేడు స్వాత్రంత్ర్య భారత వజ్రోత్సవాల్లో కీలక ఘట్టం. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయగీతాలాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రమంతా ఒకే సమయంలో జాతీయగీతం పాడేలా ఏర్పాట్లు. అబిడ్స్ పోస్టాఫీస్ దగ్గర సామూహిక జాతీయగీతాలాపనలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు కార్యక్రమం కొనసాగనుంది. అన్ని ట్రాఫిక్ కూడళ్లో నిమిషం పాటు రెడ్ సిగ్నల్ వేసి ఈ సామూహిక జాతీయగీతాలాపన వుంటుందని పేర్కొన్నారు. సామూహిక జాతీయగీతాలాపన నేపథ్యంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు…
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గోల్కొండ కోట సర్వంగా సుందరంగా ముస్తాబైంది. గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఆగస్టు 15 రోజున ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారని వెల్లడించారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16న ఉదయం 11.30 గంటలకు నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని , ఆ సమయంలో ప్రతి రహదారిలో ట్రాఫిక్…
తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం (నిన్న) ప్రగతి భవన్ లో కమిటీతో సమావేశ మయ్యారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యాచరణపై కమిటీతో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8 నుంచి 22 వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని, అంటే రెండు వారాల పాటు వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ కమిటీతో సీఎం సమావేశమవుతారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని ప్రజలందరిలో మేల్కొలిపేలా వేడుకలు ఉండాలని సీఎం పేర్కొన్నారు. ప్రతి గుండెలో…